ప్రముఖ నటుడు రావి కొండలరావు మృతి..!

ప్రముఖ సినీ నటుడు రావి కొండలరావు (88) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాతగా కొండలరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.1958లో ‘శోభ’ అనే చిత్రంతో కొండలరావు సినీ ప్రస్ధానం మొదలైంది.

 Telugu Actor, Ravi Kondalarao, Hyderabad, Kondalarao Died-TeluguStop.com

600కు పైగా సినిమాల్లో రావి కొండలరావు నటించారు.తేనే మనసులు, దసరా బుల్లోడు, ఎదురిటి మొగుడు పక్కింటి పెళ్లాం, రంగూన్ రౌడీ, భైరవ ద్వీపం, మీ శ్రేయోభిలాషి, ఓయ్, వరుడు, తదితర సినిమాల్లో నటించారు.

కొండలరావు భార్య రాధా కుమార కూడా పలు చిత్రాల్లో నటించారు.వీరిద్దరూ జంటగా చాలా చిత్రాల్లో కనిపించారు.కాగా రావి కొండలరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube