ఆ నటుడితో జాగ్రత్తగా ఉండాలంటూ యంగ్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన రానా...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలు బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు తమ చిత్రాలకు సంబంధించిన ఫోటోలు, అలాగే వీడియోలు వంటి వాటిని షేర్ చేస్తూ బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నారు.

 Telugu Actor Rana Daggubati Funny Warning To The Young Hero-TeluguStop.com

కాగా తాజాగా యంగ్ హీరో నాగ శౌర్య కూడా తన రాబోయే చిత్రం “స్టిల్” ను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.అయితే ఈ ఫోటోలో నాగ శౌర్య కాఫీ తాగుతూ అలాగే టాలీవుడ్ ప్రముఖ నటుడు “బ్రహ్మాజీ” తో కలిసి కనిపించాడు.

అంతేకాక “నా తమ్ముడు” కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు.మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి.

 Telugu Actor Rana Daggubati Funny Warning To The Young Hero-ఆ నటుడితో జాగ్రత్తగా ఉండాలంటూ యంగ్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన రానా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్లీజ్ సపోర్ట్ యంగ్ టాలెంట్ అంటూ బ్రహ్మాజీ ఇంస్టాగ్రామ్ ఖాతాని కూడా జోడించాడు.దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫోటో పై తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరో “రానా దగ్గుబాటి” స్పందించాడు.ఇందులో భాగంగా “వామ్మో ఇది ఏంటి గురు.! నాగ శౌర్య దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు.బ్రహ్మాజీ చూపులో నాకేంటో తేడా కనిపిస్తోంది.

నువ్వు ఏమంటావు…? అని కామెంట్ చేశాడు.దీంతో నాగ శౌర్య కూడా తనదైన శైలిలో స్పందిస్తూ “నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా.! నాకు ఏదో తేడా కనిపిస్తోంది” అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.దీంతో ప్రస్తుతం వీరిద్దరి కాన్వర్సేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే తాజాగా ఈ ఫోటో పై టాలీవుడ్ ప్రముఖ సిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ కూడా స్పందించింది.ఇందులో భాగంగా “టచ్ లో ఉండమని చెప్పండి పిల్లాడికి మంచి భవిష్యత్తు ఉంది” అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది.

అయితే ఈ మధ్య బ్రహ్మాజీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సరదా పోస్టులతో అందరినీ నవ్విస్తూ ఉంటాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగ శౌర్య తెలుగులో దాదాపుగా ఐదు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు.కాగా ఇందులో ఇప్పటికే “వరుడు కావలెను” చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 40 శాతం పైగా పూర్తైనట్లు సమాచారం.అలాగే “లక్ష్య” అనే చిత్రం కోసం కూడా నాగ శౌర్య “సిక్స్ ప్యాక్” బాడీతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

#TeluguActor #Bramhaji #Rana Daggubati #Funny Reply #Naga Shourya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు