వామ్మో : ఈ బుల్లి తెర మెగాస్టార్ నెలకి అంత సంపాదిస్తున్నాడా....

తెలుగు బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న  “ప్రముఖ సీరియల్ హీరో ప్రభాకర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రభాకర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, పలు ధారావాహికలకు నిర్మాతగా, హోస్టుగా ఇలా తన ప్రతిభను నిరూపించుకుని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బాగానే రాణిస్తున్నాడు.

 Telugu Actor Prabhakar Remuneration News, Prabhakar, Telugu Actor, Tollywood Ser-TeluguStop.com

 అయితే తాజాగా ప్రభాకర్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే బుల్లి తెరలో మోస్ట్ సీనియర్ మరియు ఎంతో ప్రతిభ ఉన్నటువంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ నెలకి దాదాపుగా 30 నుంచి 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పలు వార్తలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి.

కాగా ప్రస్తుతం ప్రభాకర్ ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే “వదినమ్మ” అనే ధారావాహికలో మెయిన్ పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ ధారావాహిక మంచి టిఆర్పి రేటింగులను నమోదు చేస్తోంది.

అయితే ప్రభాకర్ ఒకపక్క ధారావాహికలలో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.

Telugu Prabhakar, Telugu, Tollywood-Movie

అయితే ఆ మధ్య పలు టాలీవుడ్ చిత్రాలలో నటించినప్పటికీ ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో వెండితెరపై రాణించలేకపోయాడు.దాంతో ఇక బుల్లితెరపై తన దృష్టిని సారించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా బుల్లితెర ప్రేక్షకుల మన్ననలను పొందాడు. కాగా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన టువంటి “నెక్స్ట్ నువ్వే” అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.

 కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అలాగే అప్పట్లో దాదాపుగా 60 మందికి పైగా ఆర్టిస్టులకు ప్రభాకర్ డబ్బింగ్ చెప్పేవాడు.దీంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube