నా లవ్ ఎఫైర్ల వల్ల మొదట్లో నా భార్య బాధ పడింది.. కానీ... 

తెలుగులో పలు సీరియళ్ల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు “ప్రభాకర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రభాకర్ మొదటగా ఈ టీవీలో ప్రసారమయ్యే పలు సీరియళ్ల ద్వారా నటుడిగా బుల్లితెర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.

 Telugu Actor Prabhakar His Love Affairs In Film Industry-TeluguStop.com

ఆ తరువాత ఈ టీవీ టెలివిజన్ ఛానల్ లో కొంతకాలం పాటు క్రియేటివ్ హెడ్ గా కూడా పని చేశాడు.కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి పూర్తిగా నటన వైపు దృష్టి సారించాడు.

అంతేకాకుండా పలు సీరియళ్లకి నిర్మాత కూడా వ్యవహరించి బాగానే సంపాదిస్తున్నాడు.కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని బుల్లితెర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

 Telugu Actor Prabhakar His Love Affairs In Film Industry-నా లవ్ ఎఫైర్ల వల్ల మొదట్లో నా భార్య బాధ పడింది.. కానీ… -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే నటుడు ప్రభాకర్ పెళ్లయిన తర్వాత టాలీవుడ్ సీరియల్ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ గా రాణిస్తున్న ఓ నటితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.దీంతో తాజాగా ఈ విషయంపై నటుడు ప్రభాకర్ స్పందిస్తూ అవాస్తవమని చెప్పలేదు కానీ పరోక్షంగా మాత్రం నిజమేనంటూ చెప్పుకొచ్చాడు.

కానీ తన భార్య తనని చాలా అర్థం చేసుకుందని కూడా తెలిపాడు.ఒకానొక సమయంలో తాను నటించిన సీరియళ్లను చూసి నిజజీవితంలో కూడా ఇలాగే ఉంటారనే భ్రమలో పడి పలుమార్లు అపార్థం చేసుకుందని తెలిపాడు.

ఆ తర్వాత తాను తన భార్యని సినిమా షూటింగ్ సెట్లకు తీసుకెళ్లడంతో అప్పుడు తన భార్య అసలు విషయం అర్థం చేసుకుందని ప్రస్తుతం చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్లు తెలిపాడు.అంతేగాక తన భార్య వల్లే తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆర్థికంగాగాని లేదా ఆస్తుల పరంగాగానీ తన భార్య సలహా సూచనల మేరకు పాటించడం వల్లే ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అలాగే సీరియల్ పరిశ్రమలో ప్రేమాయణాల వల్ల తన భార్య ఒకప్పుడు బాధపడిన మాట వాస్తవమేనని కూడా స్పష్టం చేసాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటుడు ప్రభాకర్ తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా టీవీలో ప్రసారమయ్యే వదినమ్మ ధారావాహికలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఆ మధ్య ఈషా రెబ్బ కథానాయికగా నటించిన “బ్రాండ్ బాబు”, అలాగే టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్, బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్ తదితరులు నటించిన “నెక్స్ట్ నువ్వే” చిత్రాలకి దర్శకత్వం వహించాడు.కానీ ఈ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#TollywoodFilm #Prabhakar #Love Affair's #TeluguActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు