ఆ హీరోయిన్ డ్యాన్స్ సరిగ్గా చెయ్యలేదని శివశంకర్ మాస్టర్ అలా తిట్టాడు... కానీ చివరికి...

Telugu Actor Posani Krishna Murali About His Relation With Shiva Shankar Master

తెలుగు, తమిళ, హిందీ, తదితర భాషలకి చెందిన చిత్రాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి తన అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్న ప్రముఖ క్లాసికల్ డాన్సర్ మరియు డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఇటీవల పలు అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా శివ శంకర్ మాస్టర్ చివరి దశలో ఆర్థిక సమస్యలు వెంటాడడంతో వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

 Telugu Actor Posani Krishna Murali About His Relation With Shiva Shankar Master-TeluguStop.com

దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు శివశంకర్ మాస్టర్ వైద్యానికి కావలసిన డబ్బు ఇస్తామంటూ ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది.కాగా తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు పోసాని కృష్ణ మురళి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని.

శివ శంకర్ మాస్టర్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 Telugu Actor Posani Krishna Murali About His Relation With Shiva Shankar Master-ఆ హీరోయిన్ డ్యాన్స్ సరిగ్గా చెయ్యలేదని శివశంకర్ మాస్టర్ అలా తిట్టాడు… కానీ చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా తాను అప్పట్లో ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో తనకి శివ శంకర్ మాస్టర్ పరిచయమయ్యాడని.

కానీ అందరి మాదిరిగా కాకుండా తమ పరిచయం గొడవ తో మొదలైందని చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో తన చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్ సరిగ్గా డాన్స్ స్టెప్పులు వేయడం లేదని శివ శంకర్ మాస్టర్ కొంతమేర అసభ్యకర పదజాలంతో హీరోయిన్ ను తిట్టాడని.

దాంతో హీరోయిన్ ని పిలిపించి విచారించగా నిజమేనని తేలడంతో ఆ చిత్రానికి ఇవ్వాల్సిన ఫుల్ పేమెంట్ ని ఇచ్చేసి శివ శంకర్ మాస్టర్ ని అక్కడి నుంచి పంపించేశానని చెప్పుకొచ్చాడు.

Telugu Posanikrishna, Shivashankar, Telugu, Teluguposani, Tollywood-Movie

ఆ తర్వాత తాము ఇరువురూ కలిసి మరిన్ని ఇతర చిత్రాలకి పని చేశామని అలా ఏర్పడిన తమ స్నేహం ఎంతో సన్నిహితంగా ఉండేదని తెలిపాడు.అయితే శివ శంకర్ మాస్టర్ కి ఉన్నటువంటి ప్రతిభతో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు.కానీ శివ శంకర్ మాస్టర్ మాత్రం చిత్రాల రెమ్యునరేషన్ విషయంలో ఖచ్చితంగా ఉండేవాడు కాదని దాంతో కొందరు ఈ విషయాన్ని అలుసుగా తీసుకొని పని చేయించుకుని రెమ్యునరేషన్ ఎగ్గొట్టారని తెలిపాడు.

కానీ శివ శంకర్ మాస్టర్ మాత్రం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఏమీ అనేవాడు కాదని అందువల్లనే చివరి రోజుల్లో కనీసం వైద్యానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో కన్ను మూశాడని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.

Telugu Posanikrishna, Shivashankar, Telugu, Teluguposani, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా డాన్స్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ దాదాపుగా పది భాషలకి చెందిన చిత్రాలకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేశాడు.అంతే కాకుండా దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.ఎంతో ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నట్లుండి మరణించడంతో తెలుగు, తమిళ, కన్నడ, సినీ పరిశ్రమలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.

#ShivaShankar #PosaniKrishna #TeluguPosani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube