నాలో ఆ ఫీలింగ్స్ లేవు... అందుకే ఆపరేషన్ చేయించుకున్నా...

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలలో లేడీ గెటప్ లతో కామెడీ స్కిట్లలో అదరగొట్టిన ప్రముఖ కమెడియన్ పింకీ అలియాస్ సాయి గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మొదట సాయి తేజ అబ్బాయిగా జన్మించినప్పటికీ తనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కారణంగా ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు.

 Telugu Actor Pinky Alias Pinky About His Gender Change, Pinky, Jabardasth Pinky-TeluguStop.com

దీంతో తాజాగా సాయి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తన సొంత నిర్ణయం కారణంగానే తాను అమ్మాయిలా మారడానికి ఆపరేషన్ చేయించుకున్నానని స్పష్టం చేశాడు.

అంతేగాక తాను ఆపరేషన్ చేయించుకోవడానికి ముందు చాలా మంది డాక్టర్లను కూడా కలిశానని వారి సలహా మేరకే ఆపరేషన్ చేయించుకున్నానని తెలిపాడు. ఆ దేవుడు తనని అబ్బాయిగా పుట్టించినప్పటికీ తనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ మాత్రం అమ్మాయిలాగా కలిగించాడని అందువల్లనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

Telugu Pinky, Saiteja, Telugupinky, Tollywood-Movie

ఒకవేళ తాను ఈ ఆపరేషన్ చేయించుకోకుండా వేరే మహిళను పెళ్లి చేసుకున్నప్పటికీ సంతోషంగా ఉండలేనని అంతేగాక ఒక భర్తగా తన భార్యకు ఎలాంటి సుఖాన్ని అందించలేకే జీవితాంతం బాధపడాల్సి ఉండేదని అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇందులో ఎవరి బలవంతం లేదని కూడా చెప్పుకొచ్చాడు.అంతేగాక ఈ మధ్యకాలంలో కొందరు తాను డబ్బు కోసం ఇలా అబ్బాయి నుంచి అమ్మాయిగా మారానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య సాయి అలియాస్ పింకీ జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడంతో అదిరింది కామెడీ షోలోని వేణు టీంలో పని చేసేవాడు.కానీ ఇటీవలే ఈ షో కూడా పలు కారణాల వల్ల నిలిపివేయడంతో ప్రస్తుతం పలురకాల షోలు, ఈవెంట్లలో కమెడియన్ గా బహన్ రాణిస్తున్నాడు.

అంతేకాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలను కూడా  నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube