నాగబాబు ని తన భార్య పీక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిందట.. దీంతో...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, హీరోగా, నటుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సినీ నటుడు “నాగబాబు” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అప్పట్లో నాగబాబు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన “ఈటీవీ” లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీషోలో జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే అలరించాడు.

 Telugu Actor Nagababu About Second Marriage-TeluguStop.com

అంతేకాకుండా పలు సీరియళ్ళలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించాడు.తాజాగా సోషల్ మీడియా ద్వారా చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించి పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.

ఇందులో భాగంగా ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగాడు.దీంతో నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తూ తన భార్య రెండో పెళ్లి చేసుకుంటే “నీ పీక కోస్తా” అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చిందని అందువల్లనే తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సాహసం చేయలేదని సరదాగా రిప్లై ఇచ్చాడు.దీంతో నాగబాబు రెండో పెళ్లి పై చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Telugu Actor Nagababu About Second Marriage-నాగబాబు ని తన భార్య పీక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిందట.. దీంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే తనకి కాలేజీలో చదివేటప్పుడు వన్ సైడ్ లవ్ స్టోరీలు చాలానే ఉన్నాయని కానీ తానెప్పుడు అమ్మాయికి ప్రపోజ్ చేయలేదని చెప్పుకొచ్చాడు.అయితే గతంలో నాగబాబు మీమ్ క్రియేటర్స్ ని సపోర్ట్ చేస్తూ వారికి అండగా నిలబడతానని కూడా తెలిపాడు.

దీంతో అప్పటి నుంచి నాగబాబు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు.

Telugu Janasena, Nagababu, Nagababu Second Marriage, Nagababu Wife Warning, Pawan Kalyan, Telugu Actor, Telugu Actor Nagababu About Second Marriage, Telugu Actor Telugu Actor Nagababu Second Marriage News, Tollywood, Vakeel Saab, Ycp-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగబాబు పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక చక్రం తిప్పుతున్నాడు.ఇందులో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రం పై కొందరు వైసీపీ నాయకులు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నాగబాబు స్పందిస్తూ వాటిని తిప్పి కొట్టాడు.

#TeluguActor #NagababuWife #Nagababu #Pawan Kalyan #TeluguActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు