నేను లా చదివాను... కానీ ఎందుకూ ఉపయోగపడలేదు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ మరియు ప్రముఖ సినీ నటుడు “నాగ బాబు” గురించి తెలియని వారు ఉండరు.అయితే నాగబాబు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించాడు.

 Telugu Actor Nagababu About His Education Details-TeluguStop.com

దీంతో అనుకోకుండా నష్టాలు చవి చూడటంతో మొదట్లో బాగానే ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.దాంతో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల అండదండలతో మళ్ళీ బాగానే నిలదొక్కుకున్నాడు.

కాగా ప్రస్తుతం పలు చిత్రాలు, ఈవెంట్లలలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Telugu Actor Nagababu About His Education Details-నేను లా చదివాను… కానీ ఎందుకూ ఉపయోగపడలేదు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక అప్పుడప్పుడు లైవ్ మరియు చర్చా కార్యక్రమాలు నిర్వహించి కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తుంటాడు.

అయితే ఈ మధ్యకాలంలో మెగా బ్రదర్ నాగబాబు మీమ్ పేజ్ అడ్మిన్స్ ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నాడు.

గతంలో కూడా పలుమార్లు మీమ్ క్రియేటర్స్ ని అభినందిస్తూ వారికి తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మాట ఇచ్చాడు.కాగా తాజాగా కొంతమంది మీమ్ పేజ్ అడ్మిన్స్ ని పిలిచి వారితో చర్చా కార్యక్రమం నిర్వహించాడు.

ఇందులో భాగంగా మీమ్ పేజ్ అడ్మిన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు.కాగా  ఓ మీమ్ పేజ్ అడ్మిన్ మీరు ఎంత వరకు చదువుకున్నారని ప్రశ్నించాడు.

దీంతో నాగబాబు తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత “లా” కూడా పూర్తి చేశానని చెప్పుకొచ్చాడు.

అయితే తాను లా చదువు చదివినా ఇప్పటికీ తనకు ఏదైనా లీగల్ పరంగా సహాయం అవసరమైతే తన స్నేహితులని అడుగుతుంటానని అలాగే తాను చదివిన చదువు తనకి ఏమాత్రం ఉపయోగపడలేదని సరదాగా చెప్పుకొచ్చాడు.

డిగ్రీ చదువును పూర్తి చేసిన తర్వాత తాను సినిమాల్లోకి వచ్చి ఉంటే బాగానే నిలదొక్కుకునేవాడినని కానీ అప్పట్లో పరిస్థితుల ప్రభావం వేరేలా ఉండేదని తెలిపాడు.అంతేకాకుండా భవిష్యత్తులో తనకు మీమ్ క్రియేటర్స్ సహాయం అవసరమైతే కచ్చితంగా డబ్బులు చెల్లించి తన పని చేయించుకుంటానని తెలిపాడు.

దీంతో మీమ్ పేజ్ అడ్మిన్స్ అందరినీ పిలిచి వారితో ముచ్చటించినందుకుగానూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి ఓ వ్యక్తి తమని ఇంతలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కొందరు మీమ్ పేజ్ క్రియేటర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే నటీనటులు మరియు ఇతర టిక్ టాక్ స్టార్ వంటి వాళ్లు స్క్రీన్ ముందు కనిపిస్తూ ఆడియన్స్ అలరిస్తుంటే మీమ్ అడ్మిన్స్ మాత్రం తెరవెనుక ఉండి తమ మీమ్స్ తో అలరిస్తున్నారని చెబుతున్నారు.

#TeluguActor #NagababuMeme #TeluguActor #Nagababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు