Actor Madhusudhan Rao: తెలుగు పరిశ్రమ గుర్తించకపోయినా పక్క భాషల్లో బిజీ స్టార్ గా మధుసూదన్ రావు

మధుసూదన్ రావు. అస్సలు ఈ పేరు చెప్పిన మన తెలుగు వారికి ఎవరికి తెలియదు.

 Telugu Actor Madhusudhan Rao Full Busy In Other Languages Details, Actor Madhusu-TeluguStop.com

పుట్టింది పెరిగిది అంత కూడా ఆంధ్ర ప్రదేశ్ లో అయినా కూడా తెలుగు ఇండస్ట్రీ కళకు అయన పెద్దగా కనిపించలేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం చాల ప్రయత్నించాడు.

కానీ పొరుగింటి పుల్లకూర కు రుచి ఎక్కువ.అందుకే మనకు పక్క భాషలు వారు కావలి కానీ మన వారిని మనం పట్టించుకోము.

ఆలా తెలుగు వాడైనప్పటికి తమిళ, కన్నడ పరిశ్రమలో టాప్ విలన్ గా కొనసాగుతున్నాడు మధుసూదన్ రావు.ప్రస్తుతం ఈ రెండు భాషల్లో విలన్ గా మంచి అవకాశాల తో పాటు అవార్డ్స్ కి కూడా కొదవేమి లేదు.

1993 లో తమిళ సినిమా పరిశ్రమలో కి ఎంట్రీ ఇచ్చిన అక్కడ కూడా ఆయనకు పెద్దగా అవకాశాలేమి రాలేదు.దాదాపు 2014 లో గోలి సోడా అనే తమిళ సినిమా తో బ్రేక్ వచ్చే వరకు అయన చేసిన సినిమాలు చాల తక్కువ.

అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.బాహుబలి సినిమాలో కూడా నటించాడు.తెలుగు లో ఈ ముప్పై ఏళ్లలో కేవలం 20 సినిమాల వరకు నటించాడు.ఇక ఈ ఏడాది కూడా 5 తమిళ మరియు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు.

అయన నటించిన మొదటి పది సినిమాల్లో నిజం చెప్పాలంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి దక్కిన గౌరవం మాత్రమే దక్కింది.

Telugu Madhusudhan Rao, Madhusudhanrao, Tollywood-Movie

ఇక ఇప్పుడు ఫుల్ బిజీ స్టార్ అయినప్పటికి తెలుగు సినిమాలు పట్టించుకోకపోయినా మంజుల నాయుడు మాత్రం మొగలి రేకులు, చక్రవాకం సీరియల్స్ లో మంచి పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేసింది.అందుకు గల కారణం మధు సుధ రావు భార్య కూడా మన తెలుగు సీరియల్ నటి కావడం.ఆమె సైతం చక్రవాకం సీరియల్ లో మెయిన్ విలన్ గా నటించింది.

నాటి ఋతురాగాల నుండి మంజుల నాయుడు తో ఆమెకు మంచి బాండ్ ఉంది.ఇక మధుసూదన్ రావు దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

శృతి కేవలం తెలుగు సినిమాలు మరియు సీరియల్స్ తో ఇక్కడే ఉండగా, మధుసూదన్ రావు మాత్రం పక్క భాషల్లో బిజీ స్టార్ గా కొనసాగుహున్నారు.ఇక ఎప్పటికైనా మన తెలుగు నటుడిని తెలుగు వారు గుర్తించి ఆదరించి మంచి పాత్రలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube