అది కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే ఆర్తి అగర్వాల్ మరణించింది

తెలుగులో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నందమూరి నట సింహం బాలయ్య బాబు తదితర స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముంబై బ్యూటీ స్వర్గీయ నటి “ఆర్తి అగర్వాల్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అతి తక్కువ సమయంలో స్టార్డమ్ అందుకున్న ఆర్తి అగర్వాల్ ఆ స్టార్డమ్ ని అనుభవించక ముందే గుండె పోటు కారణంగా మృతి చెందింది.

 Telugu Actor Kasi Viswanath React About Actress Aarti Agarwal Death-TeluguStop.com

అయితే తాజాగా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు మరియు దర్శకుడు కాశీ విశ్వనాథ్ ఆర్తి అగర్వాల్ మృతి పట్ల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో స్పందించాడు.

ఇందులో భాగంగా తాను తెరకెక్కించిన “నువ్వు లేక నేను లేను” చిత్రంలో ఆర్తి అగర్వాల్ తో కలిసి పని చేశానని చెప్పుకొచ్చాడు.

 Telugu Actor Kasi Viswanath React About Actress Aarti Agarwal Death-అది కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే ఆర్తి అగర్వాల్ మరణించింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ చిత్రంలో మొదటగా మహేష్ బాబు ని హీరోగా నటింపజేయాలని అనుకున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల అది కుదరలేదని దాంతో ఆ అవకాశం వెటరన్ హీరో తరుణ్ కి దక్కిందని తెలిపాడు.అయితే హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా అప్పటికే “నువ్వు నాకు నచ్చావ్” చిత్రం పెద్ద హిట్ కావడంతో మంచి ఫామ్ లో ఉందని, అందువల్లనే ఆర్తి అగర్వాల్ ని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కూడా తెలిపాడు.

ఇక ఆమె మృతి పట్ల స్పందిస్తూ ఆర్తి అగర్వాల్ కి నటన పరంగా ఎంతో అనుభవం మరియు ప్రతిభ ఉన్నప్పటికీ ఆహారపు డైట్ విషయంలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఒకానొక సమయంలో పూర్తిగా బరువు పెరిగిందని చెప్పుకొచ్చాడు.ఆ కారణం చేతనే సినిమా అవకాశాలు తగ్గిపోయాయని దాంతో మళ్లీ బరువు తగ్గేందుకు చేసిన ప్రయత్నం వికటించడంతో ఆమె మరణించిందని తెలిపాడు.

అంతేకాక సినిమా పరిశ్రమలో హీరో లేదా హీరోయిన్ గా నటించాలంటే కేవలం నటన ప్రతిభ ఉంటే సరిపోదని ఆ పాత్రకి తగ్గట్టుగా ఫిజిక్ మరియు బాడీ లాంగ్వేజ్ వంటివి కూడా చాలా ముఖ్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటుడు కాశీ విశ్వనాథ్ తెలుగులో దాదాపుగా 200 కు పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించాడు.

అలాగే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో పలు చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పనిచేశాడు.ఆ తర్వాత నువ్వు లేక నేను లేను, తొలిచూపులోనే తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

#ActressAarti #Kasi Viswanath #TeluguActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు