ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నితిన్ హీరోగా నటించాడు....

తెలుగులో పలు ధారావాహికలు మరియు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ నటుడు “హర్ష వర్ధన్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవలే హర్ష వర్ధన్ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన “చెక్” మూవీ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు.

 Telugu Actor Harsha Vardhan About Nitin Flop Movies-TeluguStop.com

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ వార్తా చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన నితిన్ తన పాత్రకి న్యాయం చేసేందుకు చాలా కష్ట పడ్డాడని చెప్పుకొచ్చాడు.

 Telugu Actor Harsha Vardhan About Nitin Flop Movies-ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా నితిన్ హీరోగా నటించాడు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  అలాగే నితిన్ కి కేవలం నటనపైనే కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా మంచి పరిజ్ఞానం ఉందని అందువల్లనే తన తండ్రి తన మాటకి మంచి విలువ ఇస్తాడని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ మధ్య తాను నితిన్ హీరోగా నటించిన చిత్రానికి డైలాగ్ రైటర్ గా పని చేశానని ఆ సమయంలో నితిన్ తనతో సన్నిహితంగా ఉండేవాడని తెలిపాడు.

 దాంతో ఆ చిత్రానికి సంబంధించిన 20 శాతం షూటింగ్ పూర్తవగానే ఆ చిత్రం భవిష్యత్తుని అంచనా వేశాడని అయితే నితిన్ ఏదైతే చెప్పాడో సరిగ్గా అలాగే జరిగిందని చెప్పుకొచ్చాడు. కానీ పలు కారణాల వల్ల మాత్రమే నితిన్ ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా కూడా అందులో హీరోగా నటించాడని కానీ ఆ సినిమా పేరు మాత్రం హర్ష వర్ధన్ బయట పెట్టలేదు.

అంతేకాక నితిన్ ఓ సినిమా ప్రొడ్యూసర్ కొడుకు అయినప్పటికీ ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడని ఆ విషయం తనకు బాగా నచ్చుతుందని తెలిపాడు.

ఇక తన పెళ్లి గురించి స్పందిస్తూ తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచన లేదని స్పష్టం చేశాడు.

అలాగే ప్రస్తుతం మరిన్ని చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ డైలాగ్ రైటర్ గా కూడా పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.కాగా హర్ష వర్ధన్ తెలుగులో విశాఖ ఎక్స్ ప్రెస్ గుండె జారిగల్లంతయ్యిందే, మనం, గురు తదితర చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేశాడు.

అంతేగాక దాదాపుగా 70కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు.

#CheckMovie #TeluguActor #Nitin #Harsha Vardhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు