ఈ యాక్టర్ డాక్టర్ కూడా అని మీకు తెలుసా..?  

Telugu Actor bharath reddy real life story, Bharath reedy, Telugu Actor, real life story, Doctor news, Bharath reedy life saving news, - Telugu Bharath Reedy, Bharath Reedy Life Saving News, Doctor News, Real Life Story, Telugu Actor, Telugu Actor Bharath Reddy Real Life Story

తెలుగులో అన్న, తమ్ముడు తదితర ఈ పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ టాలీవుడ్ నటుడు భరత్ రెడ్డి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే  భరత్ రెడ్డి మొదట్లో విలన్ తరహా పాత్రలలో కూడా నటించి బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

TeluguStop.com - Telugu Actor Bharath Reddy Real Life Story

ఇప్పటి వరకు సినీ నటుడు భరత్ రెడ్డి గురించి చాలా మందికి  సినీ యాక్టర్ మాత్రమే కాదు ప్రముఖ డాక్టర్ అని తెలియదు.  అయితే ప్రస్తుతం డాక్టర్ భరత్ రెడ్డి ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తన వైద్య వృత్తిని నిర్వర్తిస్తున్నాడు.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో డాక్టర్ భరత్ రెడ్డి పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తను వైద్య వృత్తిలో ఎదుర్కున్న టువంటి ఓ చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

TeluguStop.com - ఈ యాక్టర్ డాక్టర్ కూడా అని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా తాను ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో 28 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడు హార్ట్ అటాక్ కారణంగా ఆసుపత్రికి వచ్చాడని అయితే అప్పటికే అతనికి కొంత మేర సీరియస్ గా ఉండడంతో తాను తన పై అధికారులను సంప్రదించి చికిత్స చేశానని దాంతో అతడు వెంటనే కోలుకున్నాడని తెలిపాడు. కానీ మరుసటి రోజు తాను చికిత్స అందించిన యువకుడి  తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి డబ్బు కోసం తమకు చెప్పకుండా చికిత్స చేశారని అంటూ నానా రాద్ధాంతం చేసారని తెలిపాడు.

 దాంతో తను తన పై అధికారుల ముందు తలదించుకోవాల్సి వచ్చిందని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.

అయితే తాను ఆ విషయం వల్ల పెద్దగా బాధపడక పోయినప్పటికీ  మరోసారి ఎవరైనా సరే అలాంటి ఈ పరిస్థితుల్లో ఆసుపత్రికి వస్తే  చికిత్స చేయాలంటే కొంతమేర ఆలోచించాల్సి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

దీంతో ఈ విషయంపై స్పందించిన ఇటువంటి కొందరు నెటిజన్లు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన తమ కొడుకుని  కాపాడిన  డాక్టర్ భరత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియ చేయకుండా ఇలా నిందలు వేయడం సరికాదని అంటున్నారు.అంతేగాక ఎవరో కొందరి వైద్యులు డబ్బు కోసం చేసినటువంటి పనుల కారణంగా అందరి వైద్యులు అలానే ఉంటారని అనుకోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం డాక్టర్ భరత్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యుడిగా తన సేవలు అందిస్తున్నాడు. అంతేగాక పలు టాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటిస్తున్నాడు.

#Real Life Story #TeluguActor #BharathReedy #Bharath Reedy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Actor Bharath Reddy Real Life Story Related Telugu News,Photos/Pics,Images..