ఇప్పటి వరకూ నరేష్ లాంటి వేస్ట్ ప్రెసిండెంట్ ని చూడలేదంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా సినీ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా బ్రదర్ నాగబాబు గురించి తెలుగు సినిమా పరిశ్రమలో తెలియనివారుండరు.కాగా నటుడు నాగబాబు ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేశాడు.

 Telugu Actor And Film Producer Nagababu Sensational Comments On Actor Naresh, Ac-TeluguStop.com

కానీ అనుకోకుండా ఓటమిపాలయ్యాడు.దీంతో నాగబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశాడు.

దీంతో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు సీనియర్ నటుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా ఇప్పటి వరకూ తాను నరేష్ లాంటి చేతగాని మరియు వేస్ట్ ప్రెసిడెంట్ ని చూడలేదని అంతేకాకుండా నరేష్ వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సినటువంటి విషయాలను బహిరంగంగా తెలియజేస్తూ పరువు తీసే పనులు చేశాడని ఘాటుగా విమర్శించాడు.

అలాగే నరేష్ కి గద్దె ఎక్కి పరిపాలించాలనే కోరిక ఎక్కువని దాంతో ఇతరులను తొక్కేసే పనులు చేస్తూ నియంత పాలన కి పరాకాష్టగా నిలిచాడని చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పుడు కూడా మంచు విష్ణు ప్రెసిడెంట్ అయితే అతడి వెనుక ఉంటూ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పాలని దురాలోచనతో మంచు విష్ణుకి తన మద్దతు తెలియజేశాడని అంతేతప్ప సభ్యులకి మంచి చెయ్యాలనే ఆలోచనతో కాదని ఎద్దేవా చేశాడు.

కాగా ఆ మధ్య ప్రకాష్ రాజ్ కూడా నరేష్ మద్దతు కోసం సంప్రదించగా తాను శ్రీకృష్ణ పరమాత్ముడనని చెప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతానని విర్రవీగాడని దాంతో ప్రకాష్ రాజ్ ఏకంగా నీ చక్రం ఆల్రెడీ వేరే వాళ్ళు దొబ్బే సారు.ప్రస్తుతం నువ్వు కేవలం చేతి వేలు మాత్రమే తిప్పుకుంటూ తిరుగుతున్నావ్ అంటూ సమాధానం చెప్పి అక్కడినుంచి వచ్చాడని చెప్పుకొచ్చాడు.

Telugu Naresh, Maa, Nagababu, Telugu, Telugunagababu, Tollywood-Movie

ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో కేంద్ర, రాష్ట్ర పార్టీల హస్తం ఉందని వినిపిస్తున్న వార్తలపై కూడా స్పందిస్తూ మా అసోసియేషన్ చాలా చిన్నదని ఈ చిన్న అసోసియేషన్ పై రాజకీయ పార్టీలు జోక్యం సరికదా కనీసం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని అలాంటప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నికలలో వేలు పడతారంటూ క్లారిటీ ఇచ్చాడు.ఏదేమైనప్పటికీ గతంలో పలుమార్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.కానీ ఈ సారి మాత్రం సార్వత్రిక ఎన్నికలు తలపించేలా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube