ఆ విలన్ కంటే లక్ష రూపాయలు ఎక్కువ పారితోషికం ఇవ్వమని అడిగినందుకు ఈ నటుడిని...

సినిమా పరిశ్రమ అనేది యూనివర్సల్ రంగం.కాబట్టి ప్రతిభ ఉన్నటువంటి నటీనటులు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమకైనా వెళ్లి నటించవచ్చు.

 Telugu Actor And Director Ravibabu Sensational Comments On Local Artists Remuner-TeluguStop.com

అయితే ఆయా పాత్రలను బట్టి అలాగే సినిమా పరిశ్రమని బట్టి పారితోషికం విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయి.తెలుగులో పలు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న  పాత్రలలో నటించడమేగాకుండా పలు చిత్రాలకి దర్శకుడిగా వ్యవహరించిన ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రవిబాబు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని లోకల్ ఆర్టిస్టుల పారితోషికం విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా ఆ మధ్య  తనని ఓ ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో నటించాలని చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించినట్లు తెలిపాడు.అయితే పారితోషకం విషయం గురించి చర్చిస్తూ ఉండగా తనతో పాటు ఈ చిత్రంలో అప్పటికే విలన్ గా రాణిస్తున్న హిందీ నటుడు నటిస్తున్నట్లు తనతో చెప్పారని దాంతో రవిబాబు ఆ విలన్ కి  ఇచ్చే పారితోషికం కంటే తనకి లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వాలని అడిగాడట.

అంతేగాక తనకు ఎందుకు ఆ విలన్ కంటే ఎక్కువ పారితోషకం ఇవ్వాలనే కారణాలను కూడా వివరిస్తూ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఆ విలన్ కంటే తనకే ఎక్కువ ఫేమ్ ఉందని, అంతేగాక తనకి డబ్బింగ్ మరియు వేలకు వేలు ఖర్చుపెట్టి విమాన టికెట్లు బుక్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పాడట…

ఆ తర్వాత కొంత మంది చిత్ర యూనిట్ సభ్యులు అభ్యర్థన మేరకు రవిబాబు ఆ చిత్రంలో నటించినప్పటికీ ఎంతో ప్రతిభ ఉన్నటువంటి లోకల్ ఆర్టిస్టులకు పారితోషకం ఎందుకు తక్కువ ఇస్తున్నారనే అంశాలను లేవనెత్తాడు.అంతేగాక తెలుగులో ఎంతో మంచి నటీనటులు ఉన్నారని, కానీ కొంతమంది దర్శక నిర్మాతలు అనవసరంగా పక్క సినీ పరిశ్రమల నుంచి ఆర్టిస్టులని పిలిపిస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసాడు.

అలాగే అప్పట్లో కొందరు దర్శకులు కొంత మంది నటీనటులను దృష్టిలో ఉంచుకుని వారికి తగ్గ పాత్రలను సృష్టించేవారని కానీ ఇప్పుడు అలా కాదని పాత్రతో సంబంధం లేకుండా నటీనటులు నటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీంతో లోకల్ ఆర్టిస్టులకు ఇచ్చేటువంటి పారితోషికం విషయంపై రవిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ దుమారం రేపుతున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా ఎప్పుడూ విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ  సినిమాలను తెరకెక్కించే రవిబాబు ఈ మధ్యకాలంలో తన చిత్రాలతో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతున్నాడు.కాగా ప్రస్తుతం రవిబాబు తెలుగులో “క్రష్” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేయగా మంచి స్పందన లభించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube