100 రూపాయలు అప్పు దొరక్క మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు...

గతకొద్దిరోజులుగా టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏకంగా పోసాని కృష్ణ మురళి పై బహిరంగంగా దాడికి యత్నించారు.

 Telugu Actor And Director Posani Krishna Murali Sensational Comments On Ex Chief-TeluguStop.com

కాగా తాజాగా మరోమారు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవిలో నుంచి వెళ్లిపోతూ దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్య మంత్రి చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే ప్రజలకు ఎటువంటి లోటు రాకుండా సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారని తెలిపాడు.

అయితే గతంలో తన తండ్రి కేవలం వంద రూపాయలు అప్పు దొరకక ఆత్మహత్య చేసుకొని మరణించాడని దాంతో తాను చదువుకునే రోజుల్లో చాలా కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చాడు.కానీ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు విద్య ఎంత అవసరమో తెలియజేస్తూ యూనిఫారం దుస్తులు, బూట్లు, పెన్నులు, పుస్తకాలు, బ్యాగ్ వంటి వాటితో పాటు మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారని అంతటితో ఆగకుండా స్కూలుకు వెళ్లే టువంటి ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు ప్రతి సంవత్సరం జమ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు.

Telugu Andhra Pradesh, Chandra Babu, Pawan Kalyan, Posanikrishna, Telugu, Telugu

అలాగే చంద్రబాబు నాయుడు మాదిరిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలు కూడా చేయలేదని ఎందుకంటే రాష్ట్రంలోనే కార్యాచరణలు చక్కబెట్టడానికి తీరిక లేకపోవడంతో కనీసం ఇతర దేశాలలో ఉన్నటువంటి తన సొంత కూతుళ్లను కూడా చూసేందుకు కూడా వెళ్లలేదని అలాంటి వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరి కాదని సూచించారు.అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి కాపు సామాజిక వర్గంపై ప్రేమ లేదని కేవలం ఓట్ల కోసం మాత్రమే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడంటూ అలాంటి వ్యక్తిని నమ్మితే నట్టేట ముంచి పోతాడని పవన్ కళ్యాణ్ ని హెచ్చరించాడు.అలాగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల గురించి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎద్దేవా చేశాడు.

అంతేకాకుండా ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను ఎందుకు ప్రశ్నించలేక పోయాడని ఘాటుగా విమర్శలు చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube