పూరి రొమాంటిక్ మరో అర్జున్ రెడ్డి.....

టాలీవుడ్ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు అయినటువంటి ఆకాష్ పూరి తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు.కాకపోతే సరైన హిట్టు కోసం తహ తహ లాడుతున్నాడు ఆకాష్ పూరి.

 Telugu Actor Akash Puri Latest Movie Update-TeluguStop.com

అయితే తన తండ్రి పూరి జగన్నాథ్ మాత్రం ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని నమోదు చేసి ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఇది ఇలా ఉండగా రొమాంటిక్ చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రంలోని “నా వల్ల కాదే” అనే  లిరికల్ సాంగ్ ని  శుక్రవారం రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అయితే ఈ చిత్రం అప్పట్లో టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ నటించిన టువంటి అర్జున్ రెడ్డి చిత్ర తరహాలోనే ఈ చిత్రం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయం ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసినటువంటి పోస్టర్లను బట్టి చూస్తే తెలుస్తుంది.

అయితే ఈసారి ఆకాష్ పూరి తో కచ్చితంగా హిట్ కొట్టాలని తన తండ్రి పూరి జగన్నాథ్ ఈ చిత్ర దర్శకుడికి మంచి సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులోభాగంగా ఇప్పటికే కొన్ని ఎలివేషన్ సీన్స్ లో నటించేందుకు ఆకాష్ పూరి కి తగిన తర్ఫీదు కూడా ఇచ్చినట్లు సమాచారం.

Telugu Akash Puri, Navallakade, Romantic-Movie

అయితే ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు కొన్ని పోస్టర్లు విడుదలవడంతో ఈ చిత్రంపై పూరి అభిమానులు అమాంతం అంచనాలను పెంచుకుంటున్నారు.అయితే ఆకాష్ పూరి కూడా ఈ చిత్రంపైనే తన ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడితే తన సినీ కెరీర్ ప్రమాదంలో పడుతుందని కాబట్టి కథ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube