సినిమా ఇండస్ట్రీలో మన రెమ్మ్యూనరేషన్ నిర్ణయించేది అదే....

తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు విలన్ అజయ్ గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు అజయ్ కేవలం ప్రతినాయకుడి పాత్రలలో మాత్రమే కాకుండా పలు పాజిటివ్ ఓరియెంటెడ్ పాత్రలలో కూడా నటించి బాగానే అలరించాడు.

 Telugu Actor Ajay Reacts About His Remuneration And Friends In Film Industry-TeluguStop.com

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో భాగంగా తనకి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పెద్దగా స్నేహితులు ఎవరూ లేరని కానీ ఎక్కువగా యంగ్ హీరో నితిన్, రోహిత్, జూనియర్ ఎన్టీఆర్, విక్రమ్, తదితరులతో సన్నిహితంగా ఉంటానని చెప్పుకొచ్చాడు.

ఇక సినిమా పరిశ్రమలో అవకాశాల విషయం గురించి మాట్లాడుతూ మనలో నటనా ప్రతిభ ఉంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ మనకు చాలా ఇస్తుందని తెలిపాడు.అంతేకాకుండా మన ప్రతిభకు తగ్గట్లుగా రెమ్యూనరేషన్ ని సినిమా పరిశ్రమ నిర్ణయిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు మరియు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తే చాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

 Telugu Actor Ajay Reacts About His Remuneration And Friends In Film Industry-సినిమా ఇండస్ట్రీలో మన రెమ్మ్యూనరేషన్ నిర్ణయించేది అదే…. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఇప్పుడిప్పుడే తన సినిమా కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ చేస్తున్నానని కాబట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమవుతున్నానని తెలిపాడు.అంతేకాకుండా తాను పాత్రల విషయంలో గానీ లేదా కథల విషయంలో ఎవరి సలహాలను తీసుకొనని, తనకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమని తెలిపాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య నటుడు అజయ్ తెలుగులో భీష్మ, సరిలేరు నీకెవ్వరు, సోలో బ్రతుకే సో బెటర్, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకున్నాడు.కాగా ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా నటిస్తున్నాడు.అంతేగాక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట, అలాగే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడి జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

#Remuneration #TeluguActor #Rohith #Ajay #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు