బిగ్ బాస్ 4 సీజన్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే ప్రేమ జంట మోనాల్, అఖిల్. ఎందుకంటే ఈ సీజన్ లో వీళ్లు తమ లవ్ ట్రాక్ తో బాగా ఫేమస్ అయ్యారు.
బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కూడ వీళ్ళు తమ జంటను వదిలేటట్టు లేరు.ఇద్దరు కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, కలిసి ఫోటోలు దిగడం లో అసలైన ప్రేమ జంటలను మించి పోతున్నారు.
ఇదిలా ఉంటే మోనాల్, అఖిల్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారారు.వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు.అంతేకాకుండా వీరిద్దరూ ఓ వెబ్ సిరీస్ లో కూడా చేయనున్నారట.‘తెలుగు అబ్బాయి.గుజరాతి అమ్మాయి‘ అనే సిరీస్ తో త్వరలోనే ముందుకు రానున్నారు.ఇటీవలే ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు.ఇక మోనాల్ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది.
తనను, అఖిల్ ను జంటగా చూడాలని ఎంతోమంది అభిమానులు కోరుకోవడం తో తను ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందట.
అంతే కాకుండా తను అఖిల్ తో నటించాలని అనగానే వెంటనే వేరే ఆలోచన లేకుండా ఓకే చెప్పినట్లు తెలిపింది.అంతేకాకుండా అఖిల్, అతని కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుపుతూ.
అఖిల్ కుటుంబంతో మంచి రిలేషన్ ఏర్పడిందని, అఖిల్ వాళ్ళ అమ్మ తనకు ఏది కావాలంటే అది వండి పెడుతుంది అని, అలాంటి ఆంటీ తన లైఫ్ లో ఉంటే తను సూపర్ హ్యాపీ అంటూ తెలిపింది.అంతేకాకుండా తనకు ఆరోగ్యం బాగాలేక పోయినప్పుడు వాళ్లు చాలా జాగ్రత్త చూసుకున్నారని, నేను హైదరాబాదు లో అఖిల్ ఇంటిని ‘నా సెకండ్ హౌస్ ‘ లా ఫీల్ అవుతా అంటూ తెలిపింది.
ఇక వీళ్ళు నటించే వెబ్ సిరీస్ లో భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహిస్తున్నారట.ఈ షూటింగ్ మార్చిలో ప్రారంభమవుతుందట అంతేకాకుండా ఈ సిరీస్ కు తెలుగులో డబ్బింగ్ మోనాల్ చెప్పనున్నదట.