ఈ ఫోటోలో ఉన్న బుల్లితెర సూపర్ స్టార్ ఎవరంటే?

ఒకప్పుడు వెండి తెరకు ఉన్న క్రేజ్ బుల్లితెరకు లేదనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం.వెండితెర నుండి బుల్లితెరలో నటించడానికి చాలా అవమానంగా భావించే పరిస్థితి ఉండేది.

 Television Superstar Karthika Deepam Fame Nirupam Childhood Photo-TeluguStop.com

అప్పుడు బుల్లితెర నటులకు అసలు గుర్తింపు లేదు.రానురాను నటులకు సినిమా అవకాశాలకు రాని పరిస్థితులలో బుల్లితెరలో నటించడానికి ఆసక్తి చూపించారు.

ఆ తరువాత వెండితెర ప్రముఖ నటులు బుల్లితెర పైకి రావడంతో ప్రేక్షకులు కూడా బుల్లితెర వైపు దృష్టి మల్లించారు.ఇక ప్రస్తుతం బుల్లితెర హవా నడుస్తోంది.

 Television Superstar Karthika Deepam Fame Nirupam Childhood Photo-ఈ ఫోటోలో ఉన్న బుల్లితెర సూపర్ స్టార్ ఎవరంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా నటులతో పాటుగా సీరియల్ నటులకు సైతం అంతే క్రేజ్ ఉంటోంది.ఇక అసలు విషయానికొస్తే మీరు చూస్తున్న ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తోంది కదా.అతను ఎవరో కాదు కార్తీకదీపంలో నటిస్తున్న కార్తీక్ పాత్రలో నటిస్తున్న నిరుపమ్.20 ఏళ్ల వయస్సులోనే బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ అనతి కాలంలోనే బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగారు.సాధారణంగా బుల్లితెర నటులకు గుర్తింపు అన్నది చాలా కొద్ది మందికి వస్తుంది.సినిమాతో పోలిస్తే బుల్లితెరకు అభిమానులు తక్కువ.కాని కార్తీక దీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సీరియల్ బుల్లితెర వెండితెర హద్దులు చెరిపేసిందనే అభిప్రాయానికి వచ్చారంటే ఇక ఈ సీరియల్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు.

#NirupamChild #KarthikKarthika #Vantalakka #Nirupam #Top Serial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు