జియో ఉచిత కాల్స్ అయితే అందిస్తోంది.కాని కాల్ డ్రాప్ సమస్య ఇంకా తీరలేదు.
పైగా అది కేవలం VoLTE నెట్వర్క్ మీద నడిచే మోబైల్ నెట్వర్క్.అందరికి పనికిరాదు.
ఆ మిగితా జనాలని టార్గెట్ చేస్తూ, చాలా చవక ఆఫర్ ఇచ్చేసింది టెలినార్.STD/Local అనేది లేకుండా, ఏ నెట్వర్క్ కి కాల్ చేసిన, నిమిషానికి 20 పైసలు మాత్రమే ఖర్చయ్యే ఆఫర్ తో వచ్చేసింది.
అదే టెలినార్ టూ టెలినార్ అయితే కేవలం 10 పైసా కాల్ చార్జ్ మాత్రమే పడుతుంది.అయితే ఈ ఆఫర్ కోసం స్పెషల్ రీచార్జ్ చేసుకోవాలి.
STV 34, STV 47 రీచార్జ్ లపై ఈ ఆఫర్ వస్తోంది.దీని వాలిడిటి 28 రోజులు.
మరో అద్భుతమైన ఆఫర్ FRC 44.దీంట్లో టెలినార్ టూ టెలినార్ 10 పైసా మినట్ ఇతర మొబైల్స్ కి 20 పైసా మినట్ ఆఫర్ రావడంతో పాటు, 30 రూపాయల బ్యాలెన్స్, 1 GB డేటా అందిస్తోంది.ఈ ఆఫర్ వ్యాలిడిటి ఏకంగా 180 రోజులు
.