మరికొన్ని సరికొత్త ఫీచర్స్ తో టెలిగ్రామ్ యాప్...!

సాధారణంగా ఎవరైనాగాని తమ వ్యక్తిగత విషయాలను గాని, మెసేజెస్ లను గాని భద్రంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు.కానీ ఈ మధ్య వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త పాలసీ వలన వినియోగదారుల్లో ఆ యాప్‌పై వ్యతిరేకత పెరిగింది.

 Telegram App With More Exciting New Features Of Voice Chat Experience-TeluguStop.com

దాని ఫలితంగానే సెక్యూరిటీగా ఉండే సరికొత్త యాప్స్ ను వెదుకుతున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం టెలిగ్రామ్‌ యాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.

టెలిగ్రామ్ యాప్ లో మాన వ్యక్తిగత సమాచారం చాలా గోప్యంగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే.అందుకనే ఇప్పుడు టెలిగ్రామ్‌ యాప్‌ భారత దేశంలో చాలా వేగంగా ఎక్కువమంది యూజర్లకు చేరువవుతోంది.

 Telegram App With More Exciting New Features Of Voice Chat Experience-మరికొన్ని సరికొత్త ఫీచర్స్ తో టెలిగ్రామ్ యాప్…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగానూ టెలిగ్రామ్‌కు డిమాండ్‌ కూడా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో వినియోగదారులకు టెలిగ్రామ్ యాప్ ను మరింత దగ్గరే చేసే క్రమంలో యాప్‌ డెవలపర్లు కొన్ని సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.

రోజు రోజుకీ పెరుగుతున్న వినియోగదారులను మెప్పించడానికి టెలిగ్రామ్‌ కొత్త ఫీచర్లను తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది.అలాగే యాప్ ను ఎప్పటికప్పుడు ఆప్‌డేట్లతో ముందుకు తీసుకుని వెళ్తున్నారు.అయితే టెలిగ్రామ్ యాప్ యూస్ చేసేవాళ్ళకి ఒక శుభవార్త.అది ఏంటంటే ఈ ఏడాది మార్చి నెలలో టెలిగ్రామ్‌ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ చేసింది.

వాయిస్‌ చాట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మరింత మెరుగుపరచడం కోసం ఈ ఫీచర్‌లో మరిన్ని అప్‌డేట్‌లు కూడా చేసింది.

Telugu New Features, New Updates, Notification, Schedule, Telegram, Telegram Application, Telegram Beta Version, Telegram New Update, Telegram V7.7.0, Voice Chat, Voice Chat Experience-Latest News - Telugu

ఇప్పుడు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం బీటా చానల్‌ పైన మరో అప్‌డేట్‌ను మార్చింది.ఇటీవలి నివేదికల ప్రకారం బీటా ఛానల్‌పై టెలిగ్రామ్‌ వి7.7.0 రావడం మొదలయ్యింది.ఈ వాయిస్‌ చాట్‌ ను షెడ్యుల్‌ చేయడం కోసం, అడ్మిన్లు చానల్‌ ఐకాన్స్‌పైన, అలాగే త్రీ–డాట్‌ సెట్టింగ్స్‌పైన క్లిక్ చేయగానే అక్కడ వాళ్లకు స్టార్ట్‌ వాయిస్‌ చాట్‌ ఆప్షన్ కనిపిస్తుంది.

దానిని సెలక్ట్‌ చేసుకోని, తర్వాత కొత్త చీషెడ్యుల్‌ వాయిస్‌ చాట్‌ ఆప్షన్ పైన ట్యాప్‌ చేయాలి.అప్పుడు అడ్మిన్లు తేదీని, సమయాన్ని ఎంచుకోవచ్చు.తర్వాత వాయిస్‌ చాట్‌ షెడ్యుల్‌ చేసుకోవడం కోసం కిందున్న బటన్ సెలక్ట్‌ చేసుకోవాలి.అలా సెలెక్ట్ చేసిన తరువాత అందులోని సభ్యులందరికీ కౌంట్‌డౌన్ తో సహా షెడ్యుల్‌ వాయిస్‌ చాట్‌ నోటిఫికేన్‌ అనేది కనిపిస్తుంది.

#New Features #TelegramNew #Telegram V7.7.0 #Schedule #VoiceChat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు