మళ్లీ మొదలుపెట్టారు : రేవంత్ రెడ్డిపై సీనియర్ల గుర్రు  

Telangana Seniour Congress Leaders Angry On Revanth Reddy-revanth Reddy,telangana Congress,telangana Muncipal Elections,vijaya Reddy Case

కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుంది, నాయకులంతా ఐక్యతతో పార్టీని ముందుకు నడిపిస్తూ మళ్లీ పునర్వైఫవం తీసుకొస్తారని తెలంగాణ కాంగ్రెస్ గురించి చాలామంది చాలా ఆశలే పెట్టుకున్నారు.ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న విషయం తెలిసిందే.

Telangana Seniour COngress Leaders Angry On Revanth Reddy-Revanth Reddy Telangana Congress Muncipal Elections Vijaya Case

దీన్ని అవకాశం గా తీసుకుని ప్రజా ఉద్యమాలతో తమ పార్టీకి మైలేజ్ పెంచాల్సిన నాయకులు తమ గ్రూపు విబేధాలకు పదును పెట్టి తమలో తామే గొడవలు పడుతూ పార్టీ పరువుని బజారున పడేస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై సీనియర్ నాయకులంతా మూకుమ్మడిగా వ్యతిరేక గళం పెంచుతూ ఆయనకు పార్టీలో ప్రాధాన్యం దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్ష పదవి ఖాళీ అవ్వడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ నాయకులంతా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.దీని కోసం తమ అందరికి అడ్డుగా ఉన్నట్టు కనిపిస్తున్న రేవంత్ రెడ్డిని పోటీ నుంచి పక్కకు తప్పించేందుకు ముందుగా వారంతా ఏకమై రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.

ఇదే విషయమై కాంగ్రెస్ అధిష్టానం దూతగా తెలంగాణకు విచ్చేసిన ఆజాద్‌ సమక్షంలోనే, గొడవలకు దిగారు.ఒకవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి హత్యతో రణరంగంగా మారిన తెలంగాణాలో అధికార పార్టీ మీద ఎక్కడలేని విమర్శలు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని అధిష్టానం భావిస్తోంది.హుజూర్ ‌నగర్‌ పరాజయాన్ని మరిచిపోయి, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆలోచిస్తోంది.

కానీ ఇదే సమయంలో టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.ఇదే ఇప్పుడు సీనియర్ జునిఔర్ల మధ్య యుద్దానికి తెరలేపింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌ వచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.అయితే, టీపీసీసీ చీఫ్‌ను ఖరారు చేసేందుకే ఆయన వచ్చారన్న ప్రచారం జరిగింది.

దీని కారణంగానే సీనియర్ నాయకులంతా రేవంత్‌ రెడ్డి ని టార్గెట్ చేసుకుంటూ హడావుడి చేయడంతో సమావేశం రసాభాసగా మారింది.దీనికి కారణం రేవంత్‌ను టీపీసీసీ చీఫ్ చేస్తారని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ విషయంపై మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ, వీహెచ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ముందే వారిద్దరూ పరస్పరం వాదులాడుకున్నారు.

నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, తనలాంటి సీనియర్లను అసలు పట్టించుకోవడం లేదని వీహెచ్ అభ్యంతరం తెలిపారు.అయితే వీహెచ్‌ను షబ్బీర్ అలీ వారించారు.దీంతో సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే అసహనంగా వెళ్లిపోయారు వీహెచ్.ఈ సందర్భంగా సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డి మీద తమకు ఉన్న అసహనాన్ని అంతా ఆజాద్ ముందు వెళ్లగక్కారు.

అయితే ఇప్పట్లో ఈ వ్యవహారాన్ని కడపకూడదని, మున్సిపల్ ఎన్నికల తరువాత మాత్రమే టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

.

తాజా వార్తలు

Telangana Seniour Congress Leaders Angry On Revanth Reddy-revanth Reddy,telangana Congress,telangana Muncipal Elections,vijaya Reddy Case Related....