హైకోర్టును కూడా తరలించే యోచనలో తెలంగాణ సర్కార్  

Telangana To Have New High Court Soon-rajendra Nagar Outer Ring Road,telangana,telangana Cm Kcr

తెలంగాణా సర్కార్ హైకోర్టు ను తరలించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ లో చేపట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే.

Telangana To Have New High Court Soon-Rajendra Nagar Outer Ring Road Telangana Cm Kcr

అయితే ఇప్పుడు తాజాగా హైకోర్టు ను కూడా తరలించే యోచనలో ఉన్నట్లు సమాచారం.రాజేంద్రనగర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న బుద్వేల్ ప్రాంతానికి హైకోర్టును తరలించాలని ప్రభుత్వం నిర్ణయించగా,దీనిపై న్యాయస్థానం కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే కొంతమంది న్యాయవాదులు మాత్రం హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్నారు.ఇప్పుడున్న చోటనే హైకోర్టును కొనసాగించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

Telangana To Have New High Court Soon-Rajendra Nagar Outer Ring Road Telangana Cm Kcr

మూసీ నది ఒడ్డున వందేళ్ల క్రితం నిర్మించిన హైకోర్టు భవనాలు పాతవి కావడం ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవడంతో ఇప్పుడున్న చోటు నుంచి హైకోర్టును తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.హైకోర్టు భవనంలో రెండుసార్లు అగ్నిప్రమాదాలు జరగడం కూడా ఒక కారణం గా తెలుస్తుంది.


ఇందుకోసం తెలంగాణా సీఎం కేసీఆర్ కు లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో బుద్వేల్‌లో ఇప్పటికే 70 ఎకరాల ఖాళీ స్థలాన్ని హైకోర్టుకు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.

దీనిపై త్వరలోనే బార్ కౌన్సిల్‌లో చర్చించి అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.

తాజా వార్తలు

Telangana To Have New High Court Soon-rajendra Nagar Outer Ring Road,telangana,telangana Cm Kcr Related....