తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.పాలమూరులో నిర్వహించిన బీజేపీ ప్రజా గర్జన సభలో ఆయన పాల్గొన్నారు.
ఈ మేరకు తెలంగాణ అవినీతి రహిత, పారదర్శక పరిపాలన కోరుకుంటోందని మోదీ తెలిపారు.అయితే తెలంగాణ తప్పుడు వాగ్దానాలను కోరుకోవడం లేదన్నారు.
ప్రజలు చెప్పింది చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.రాణీ రుద్రమదేవి లాంటి వీర వనితలకు పుట్టినిల్లు తెలంగాణ అన్న మోదీ ఈ మధ్యనే మనం మహిళా శక్తిని గౌరవిస్తూ మహిళా బిల్లును తీసుకొచ్చామని తెలిపారు.
తమ జీవితాలను అనుక్షణం ఉద్ధరించడానికి ఒక సోదరుడు ఢిల్లీలో ఉన్నారని తెలంగాణ మహిళలకు తెలుసని చెప్పారు.తెలంగాణకు మేలు కలిగే విధంగా అనేక కార్యక్రమాలను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని వెల్లడించారు.