ఎన్నికల్లో ఆ పేర్లతో తికమక ... ఇదో పరేషాన్  

ఎన్నికల్లో భారీ భారీగా ఖర్చుపెట్టి…చెమటోర్చేలా … సందు గొందులు తిరుగుతూ…ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని హమ్మయ్య .. అంటూ పోలింగ్ తేదీ కోసం ఎదురుచూపులు చూస్తున్న కొంతమంది అభ్యర్థులకు తమ పేర్లను పోలి ఉండే పేరుకలిగిన అభ్యర్థులు టెన్షన్ పుట్టిస్తున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు … మరికొన్ని చోట్ల ఇంటి పేర్లు ఒకటే ఉండటం ఓటర్లను కాస్త గందరగోళానికి గురిచేసే అంశంగా ఉందని నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Telangana Voters Are Confused For Same Names Of Mla Candidates-

Telangana Voters Are Confused For Same Names Of Mla Candidates

ఈ విధంగానే … నాగ్‌ కర్నూల్‌ బరిలో మర్రి జనార్థన్‌ రెడ్డి, నాగం జనార్థన రెడ్డిలు బరిలో ఉండటంతో ఓటర్లు తికమకపడుతున్నారు. బోధ్‌, సిర్పూర్‌, పటాన్‌ చెరువులలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే… హుస్నాబాద్‌, కూకట్‌పల్లి, వైరా అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఇంటి పేరున్న అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరు తమ రాజకీయ భవితవ్యం తలకించులు చేసేస్తారేమో అన్న ఆందోళనలో ప్రధాన పార్టీల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.