బాబు పరువు తీసిన...“తెలంగాణా వెలుగు”..

ఏపీ ఎన్నికల్లో ఘోరమైన వైఫ్యలం చవిచూసిన చంద్రబాబు నాయుడికి రోజుకో విధంగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.జగన్ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన రోజునే బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై బెల్టు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

 Telangana Velugu Paper Article Write On Chandrababu Storie-TeluguStop.com

అంతేకాదు ఆ మేరకు అన్ని శాఖల అధికారాలతో సమీక్షలు నిర్వహించి లెక్కలలో ఉన్న బొక్కలు తీయండి అంటూ ఆదేశాలు జారీచేశారు కూడా.రివర్స్ టెండర్స్ అంటూ అందరిని ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేశారు.

ముఖ్యంగా చంద్రబాబు ఈ విషయంలో ఒకింత ఆందోళన చెందినట్టుగా కూడా టాక్ వినిపించింది.

ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి ఏపీలో బాబు అవినీతిని బయట పెడుతానని అంటుంటే.

మరో పక్క తెలంగాణలో సైతం చంద్రబాబు పై విమర్సలు వెల్లువలా వస్తున్నాయి.తెలంగాణా పత్రిక వెలుగు ఇచ్చిన ఓ స్టొరీ తో బాబు పరువు మూసీలో కొట్టుకు పోయిందనే చెప్పాలి.

ఈ పత్రికలో జాబులేని బాబు అనే శీర్షికతో వచ్చిన కధనం మోస్ట్ పాపులర్ అయ్యింది.ప్రస్తుతం చంద్రబాబు దీన పరిస్థితి ఇదీ అంటూ ఆ కధనంలో చంద్రబాబుని ఏకేశారు.

-Telugu Political News

2014 లో జాబు రావాలంటే బాబు రావాలి అనే నినాదం ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికి తెలిసిందే.

ఆ నినాదం అందరిని ఆకట్టుకుంది.కానీ ఐదేళ్ళలో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం జాబులు కల్పించలేక పోయినా సరే మళ్ళీ అదే నినాదాన్ని ఈ ఎన్నికల్లో కూడా లేవనెత్తడంతో ఒళ్ళు మండిన నిరుద్యోగులు బాబు జాబు తీసేశారు అంటూ కధనంలో పేర్కొన్నారు.అసలు టీడీపీ ఈ దుస్థితి పట్టడానికి గల ఏకైక కారణం తండ్రీ, కొడుకులే అంటూ విమర్శించింది.

చంద్రబాబు పుత్రుడు లోకేష్ మంత్రిగా ఉండికూడా సరైన న్యాయం పార్టీకి చేయలేక పోయారని.చంద్రబాబు పై బడుతున్న వయసు ఆయనకి సహకరించలేదని.

అందుకే పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం బలోపేతం కాకపోవడంతో టీడీపీ ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుందని తెలిపింది.అబివృద్ది కాకపోవడం తెలుగుదేశానికి ఇబ్బందిగా మారాయని విశ్లేషించింది.

భవిష్యత్తులో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకమేనని, ఇప్పుడు సరైన నాయకుడు పార్టీని నడిపించక పొతే పార్టీ మనుగడ కష్టమేనని చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube