'రెబెల్స్' బెదిరింపులు ఉత్తుత్తివేనా ..? నిజంగా అంత సీన్ లేదా ...?

చెబితే వినరు .కొడితే ఏడుస్తారు అనే విధంగా… తెలంగాణాలో వివిధ పార్టీల్లో టికెట్ దక్కని నాయకులంతా … రెబెల్స్ గా మారి గుబులు పుట్టిస్తున్నారు.

 Telangana United Rebel Front Is Real Or Not-TeluguStop.com

రోజురోజుకు వీరు తమ ప్రకటనలతో పార్టీలను కంగారు పెట్టేస్తున్నారు.ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా… తెలంగాణాలో అన్ని పార్టీలకు రెబెల్స్ బెడద ఎక్కువగా ఉంది.

సొంత పార్టీ నేతలే ఇలా గుబులు పెట్టిస్తుండడం నచ్చచెప్పినా… వినకపోవడంతో వీరిని ఎలా బుజ్జగించాలో తెలియక పార్టీలు సతమతం అవుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ సెగలు ఎక్కువగా ఉన్నాయి.

వీరు ఇంతటితో ఆగడంలేదు సరికదా తామంతా… కలిసి కూటమిగా ఏర్పడతామంటూ ప్రకటించడం కొంత ఆసక్తికరంగా ఉంది.

యునైటెడ్ రెబెల్స్ ఫ్రెంట్ పేరుతో తామంతా ఎన్నికల బరిలోకి దిగుతామంటూ ప్రకటించేశారు.వీరంతా కలిసి బోడ జనార్థన్‌ నేతృత్వంలో ముందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.! సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కొంతమంది కాంగ్రెస్ రెబెల్‌ నేతలు మీడియాతో సమావేశమయ్యారు.

దశాబ్దాలుగా పార్టీకి కట్టుబడి, చిత్తశుద్ధితో సేవలు చేస్తున్నవారికి టిక్కెట్లు దక్కకపోవడం దారుణమంటూ జనార్థన్ ఆరోపించారు.ఒక నెల ముందు పార్టీలో చేరినవారికీ, మూడు సార్లు ఓడిపోయినవారికి టిక్కెట్లు ఇచ్చారన్నారు.

విజయరామారావు మాట్లాడుతూ… తనకు ఇష్టం వచ్చినవారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్లు ఇప్పించుకున్నారనీ, సీట్లు అమ్ముకున్నట్టు కూడా ఆధారాలు ఉన్నాయన్నారు.రౌడీ షీటర్లు, బ్యాంకు దోపిడీలు చేసినవారు, రియల్ ఎస్టేట్ అక్రమ దందాలు చేస్తున్నవారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చారంటూ మండిపడ్డారు.

తమకు న్యాయం జరగకపోతే ఏకంగా 40 సీట్లలో బరిలోకి దిగుతామని విజయరామారావు భారీ డైలాగులు కూడా చెప్పేసారు.

అయితే ఇంత భారీ భారీ డైలాగులు చెప్పేసినా… వీరంతా నిజంగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనేది అనుమానాస్పదంగానే ఉంది.అసలు వీరంతా కలిసి ఒకే గుర్తుపై బరిలోకి దిగే ఛాన్స్ ఉందా అనేది పెద్ద సందేహమే.మరీ లోతుగా ఆలోచిస్తే… నలభైమంది రెబెల్స్ ఐక్యంగా ఉన్నామనీ, పోటీ చేస్తామని గొప్పగా చెప్పారు.

కానీ, ప్రెస్ మీట్ కి అందరూ ఎందుకు రాలేదు.? ఒకవేళ వచ్చి ఉంటే కచ్చితంగా కాంగ్రెస్ పై ఒత్తిడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.ఇంకోటి, వీరందరూ స్వతంత్రులుగా బరిలోకి దిగితే, ఒకే గుర్తుపై పోటీ ఎలా సాధ్యం? అది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం కదా! కేవలం కాంగ్రెస్ పార్టీని బెదిరించడం కోసం చేసే ఒక ప్రయత్నం మాత్రమే అన్నట్టుగా ఉంది.అసలు వీరిలో వీరికి ఐక్యత రావడం అనేది అసాధ్యం అన్నట్టుగా పార్టీలు అంచనాకు వచ్చేసాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube