తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే.. ?

దేశవ్యాప్తంగా కరోనా తన వేటను మళ్లీ మొదలెట్టిన విషయం తెలిసిందే.ఇప్పటికే కొన్ని రాష్ట్రల్లో విచ్చలవిడిగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అధికారులు శ్రమిస్తున్నారు.

 Telangana Today Corona Virus Details, Telangana, Today, Coronavirus, Details, Co-TeluguStop.com

ఈ క్రమంలో కరోనా టీకా పక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తక్కువ ధరకే కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

ఇన్నిరకాలుగా ప్రజలను ఈ వైరస్ నుండి కాపాడడానికి ప్రయత్నిస్తున్న అధికారులకు ప్రజల నుండి స్పందన తక్కువగానే ఉందట.కోవిడ్ కట్టడికి తీసుకోవలసిన చర్యలను పాటించే వారు తక్కువ మంది ఉన్నారట.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.పలు జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో నమోదైన కరోనా వివరాలను తెలుసుకుంటే.176 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందట.అదే సమయంలో 163 మంది కోలుకోగా, ఒకరు మృతి చెందారట.ఇకపోతే తెలంగాణలో ఇప్పటివరకు 2,98,807 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,634 మంది మరణించారు.కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ అధికమవుతుండడం పట్ల పొరుగునే ఉన్న తెలంగాణలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube