వాషింగ్టన్ లో జూన్ -22 న తెలంగాణా తీన్మార్ సబరాలు..!!!

తెలంగాణాలో తీన్మార్ వింటే ఎలాంటి వాళ్ళయినా సరే స్టెప్పులు వేయాల్సిందే.దరువు పడే కొద్ది కళ్ళలో ఊపు వస్తూనే ఉంటుంది.

 Telangana Theenmar Festivals From Jun 22 In Washington 22-TeluguStop.com

తెలంగాణా సాంగ్స్, ఫోక్ డ్యాన్స్ ఇలా ప్రతీదీ తెలంగాణా సంస్కృతీ సాంప్రదాయలకి అద్దం పట్టేలా ఉంటాయి.ముఖ్యంగా అక్కడి పాటలు ప్రపంచ నలుమూలల ఉన్న తెలుగు వారితో ఎంతో ఆదరణ పొందాయి.

ఈ క్రమంలోనే అమెరికాలోని వాషింగ్టన్ లో తెలంగాణా తీన్మార్ ఏర్పాటు చేశారు.

వాషింగ్టన్ లో జూన్ -22 న తెలంగాణ

వాషింగ్టన్ తెలంగాణా అసోసియేషన్ మరియు తెలంగాణా అమెరికా తెలుగు సంఘం ఈ రెండు సంస్థలు కలిసి అక్కడి తెలుగు ప్రజల కోసం తెలంగాణా తీన్మార్ ని ఏర్పాటు చేశాయి.జూన్ -22 న అంగరంగ వైభవంగా ఈ వేడుకలని నిర్వహించనున్నాయి.ఈ కార్యక్రమానికి తెలుగు ప్రజలు అందరూ తప్పకుండా రావాలని ప్రకటన చేశారు.

జూన్ 22 శనివారం , సాయంతం 3 నుంచీ 9 గంటల వరకూ ఈ వేడుకలు జరుగుతాయని తెలిపారు.

ఈ వేడుకలకి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ పెట్టలేదని ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాల్గొననున్నారు.ఈ వేడుకల్లో తెలంగాణా కోయ డ్యాన్స్, లంబాడి డ్యాన్స్, పిట్టల దొర , బతుకమ్మ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు నిర్వాహకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube