ఊయలే ఉరితాడై విద్యార్థి మృతి  

Telangana Telugu Viral News Divya Corona Virus India Lock Down - Telugu Bejanki Mandalam, Corona Virus, Divya Hanging, India Lock Down, Kallepalli Village, Telangana Siddipet

సరదాగా ఆడుకునేందుకు ఇంట్లో ఊయలే తొమ్మిదో తరగతి విద్యార్థి మెడకు ఉరితాడై బలితీసుకున్న ఘటన తెలంగాణా రాష్ట్రం సిద్ది పేట జిల్లాలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే….

 Telangana Telugu Viral News Divya Corona Virus India Lock Down

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన పబ్బతి నరసయ్య,సరోజ దంపతులకు ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు.అయితే దంపతులు ఇద్దరూ కూడా వూరిలో దొరికిన కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే పెద్ద కుమార్తె దివ్య(14) 9 వ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడం తో పాఠశాలలు మూసేయడం తో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు.

ఊయలే ఉరితాడై విద్యార్థి మృతి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే సరదాగా పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు అని దూలానికి ఊయల కూడా కట్టారు.అయితే ఆ ఊయలలో ఆడుకుంటూ దివ్య ఊయలకు కట్టిన చీర,దివ్య మేడలో ఉన్న చున్నీ రెండు మెడకు బిగుసుకుపోవడం తో ఊపిరాడక దివ్య మృతి చెందినట్లు తెలుస్తుంది.

అయితే ఆ సమయంలో తల్లి ఇంటివద్దే ఉందని,

అయితే తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండడం తో గమనించుకోలేదు.అయితే అప్పటికి తల్లి సరోజన పలుమార్లు దివ్యను పిలిచినా పలకకపోవడంతో ఆడుకుంటుందేమోనని భావించి వదిలేసింది.

అయితే ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది.దివ్య తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..