అమెరికాలో తెలంగాణా టెకీ మృతి...!!!  

Telangana Techie Kama Reddy Arun Kumar Us - Telugu Arun Kumar, Indian Techie Died In America, Kamareddy, Nri News, Telangana

దేశం కాని దేశంలో, తల్లి తండ్రులకి దూరంగా ఉంటూ, ఆర్ధిక అవసరాల కోసం, వ్యక్తిగత అభివృద్ధి కోసం విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ఎన్నారైలు మృత్యు వాత పడటం అందోళన కలిగిస్తోంది.ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.

 Telangana Techie Kama Reddy Arun Kumar Us

వివిధ కారణాలతో మృతి చెందుతున్నా సరే ఎన్నారైల తల్లి తండ్రులు మాత్రం తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు…తాజాగా
అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో తెలంగాణా కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన ఇంజనీర్ అరుణ్ కుమార్ అర్ధంతరంగా మృతి చెందారు.కామారెడ్డి జిల్లా భిక్క నూరు మండలం కి చెందిన బూర్ల అరుణ్ కుమార్ మృతి చెందినట్లుగా ఆయన కుటుంభ సభ్యులు తెలిపారు.

ఎన్నో ఆశలతో సుమారు 16 ఏళ్ళ క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడిన అరుణ్ కుమార్ కి భార్యా, ఓ పిల్లాడు ఉన్నారు.కుటుంభ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.

అమెరికాలో తెలంగాణా టెకీ మృతి…-Telugu NRI-Telugu Tollywood Photo Image

తెల్లవారు జాము సమయంలో అరుణ్ కుమార్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని, ఎంతగా ప్రయత్నించినా సరే శ్వాస అందలేదని, దాంతో ఆయన మరణించారని తెలిపారు.ఆయన భార్య, పిల్లాడు అక్కడే ఉన్నారని, అరుణ్ కుమార్ మృత దేహాన్ని అక్కడి నుంచీ తెలంగాణా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అరుణ్ కుటుంభ సభ్యులు తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test