త్వరలో లో కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి     2017-10-07   05:35:15  IST  Bhanu C

రేవంత్ రెడ్డి..తెలంగాణా రాజకీయంలో తనది ఒక ప్రత్యేకమైన శైలి..తెలంగాణా టిడీపిలో అత్యంత కీలకమైన వ్యక్తి. అనంతపురం లో కేసీఆర్ పర్యటన..అక్కడ పరిటాల ఫ్యామిలీ ని కేసీఆర్ కలవడం..ఆంధ్రా టిడీపి నేతలు కేసీఆర్ తో సానిహిత్యం గా ఉండటం రేవంత్ రెడ్డికి నచ్చలేదట.అందుకే కేసీఆర్ మీద తెలంగాణాలో మాటల దాడి చేశాడు రేవంత్.అంతేకాదు తెలంగాణాలో ఉన్న టిడీపి సీనియర్ నాయకులని లెక్క చేయడం లేదట. రేవంత్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం కూడా ఏకపక్షంగా ఉంటోంది అని..అస్సలు తెలంగాణా టిడీపి అధినాయకులకి చెప్పడం లేదట.

కాంగ్రెస్ పార్టీ కి ప్రత్యామ్నాయం గా వచ్చింది తెలుగుదేశం పార్టీ…ఒక వేళ ఎన్నికల్లో పొత్తు కలవాల్సి వస్తే తెలంగాణలో టిడిపి టీఆరెస్ తో అయినా జతకడుతుంది కానీ కాంగ్రెస్ తో ముందుకు వెళ్ళీ ప్రయత్నం చేయదు. కానీ ఇప్పుడు రేవంత్ చేస్తున్న పనులు..తన నిర్ణయాలు..కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయి. ఇంకో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ లోకి రేవంత్ జంప్ అవుతున్నాడు అనే వార్తలు తెలంగాణా రాజకీయాలో చక్కర్లు కొడుతున్నాయి..ఇది నిజమే అన్నట్టుగా కాంగ్రెస్ నేతలకి రేవంత్ రెడ్డి వత్తాసు పలుకుతూ మాట్లాడం..ఈ వార్తలకి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

తెలంగాణా లో టిడిపికి భవిష్యత్తు లేదు అని అందరూ తేల్చేస్తున్నారు..అటు బిజేపి కూడా వచ్చే ఎన్నికల్లు ఏ పార్టీతో పొట్టు ఉండదు అని చెప్పడంతో..రేవంత్ రాజకీయ భవిష్యత్తు మీద ఆలోచనలో పడ్డాడు..టిడీపిని నమ్ముకుంటే భవిష్యత్తు ఉండదు అని భావించిన రేవంత్ రెడ్డి..తెలుగు దేశానికి దూరం అవ్వడం కోసమే కాంగ్రెస్ తో చనువుగా ఉంటున్నాడు అని తెలుస్తోంది. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం వెనుక కారణం కూడా ఇదేనట..తెలుగుదేశం అధినాయకత్వాన్ని మాటకూడా అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం..ఇలా రేవంత్ చేసే పనులతో విసిగిపోయి టిడీపి వాళ్ళే రేవంత్ రెడ్డిని బయటకి పంపేస్తే సింపతీ కొట్టేసి అదొక కారణాన్ని సాకుగా చుపచ్చు అని అనుకున్నాడట. ఇది ఇలా ఉంటే మరొక వారం రోజుల్లో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా రేవంత్ లాంటి వాక్ చాతుర్యం ఉన్న వ్యక్తి పార్టీలో ఉంటే పార్టీ కి విజయం ఖయం అన్నట్టుగా భావిస్తోందట.టీఆరెస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి కూడా రేవంత్ కాంగ్రెస్ తో కలవనున్నాడు అని చెప్పడం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట రేవంత్.. ఎంతన్నా నిప్పు లేనిదే పొగ రాదుకదా.