తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీలక కామెంట్స్..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీలో  చేరుతున్నారు అని తనపై వస్తున్న ప్రచారాన్ని ఎల్ రమణ ఖండించారు.

 Telangana Tdp Chief Sensatational Comments-TeluguStop.com

ఇటీవల జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తెలంగాణ ఉద్యమకారులు మరియు ఇతర రాజకీయ పక్షాల నాయకులు ఇటీవల తనతో చర్చించడం జరిగిందని, రాజకీయ ఉద్దేశం ఏంటి ? ఎటువంటి కార్యాచరణ తో భవిష్యత్తు రాజకీయాలు చేయబోతున్నారు అంటూ టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నేతలు ప్రశ్నించటం జరిగింది అని ఎల్ రమణ క్లారిటీ ఇచ్చారు.

కానీ ఇతర పార్టీల నుండి ఎటువంటి ఆఫర్లు రాలేదని తెలిపారు.

 Telangana Tdp Chief Sensatational Comments-తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీలక కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా తనకి బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పార్టీకి సాయశక్తులా కృషి చేస్తున్నాను పైగా పార్టీ తరఫున పది సార్లు బి ఫారం తీసుకుని పోటీ చేయడం జరిగింది అటువంటి పార్టీని ఎందుకు విడిచి పెడతాను అంటూ ఎల్.రమణ పేర్కొన్నారు. టీడీపీ సంక్షేమ ఫలాలు బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఎన్నో మేలు చేశాయని స్పష్టం చేశారు.రాజకీయ పరంగా అనేక ఇబ్బందులు ఉంటాయి.అయినా సరే వాటిని ఎదుర్కొని బాధ్యత తీసుకుని ముందుకు సాగుతామని ఎల్.రమణ స్పష్టం చేశారు.తనకి సోషల్ మీడియా మాధ్యమాల పై పెద్దగా ఐడియా లేదు కాబట్టి తనపై తప్పుడు ప్రచారాలు పాల్పడుతున్నారని తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.

#Telengana Tdp #Ts Poltics #L. Ramana #Telangana #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు