సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు..అమెరికా కాలేజీల్లో చదువుకునే బంపర్ ఆఫర్..!!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవడం అంటే మామూలు విషయం కాదు.ఎంతో ప్రతిభ, అనర్గళంగా ఆంగ్ల బాషను మాట్లాడగలిగే సత్తా ఉండాల్సిందే.

 Three Telangana Students Bags Us Fellowship Offer, Us Fellowship Offer, Telang-TeluguStop.com

అయితే పేద వారు, మధ్య తరగతి వారు ఎంత ప్రతిభ ఉన్నా సరే ఆర్ధిక పరిస్థితులు సహకరించక పొతే అమెరికా ఉన్నత చదువు కల నెరవేరనట్టే.అయితే అలాంటి వారికోసం కూడా అమెరికాలో కొన్ని కాలేజీలు ప్రోశ్చాహాకాలు ఇస్తూ వారి కలను నెరవేర్చుతున్నాయి.

ఇలాంటి అవకాశాన్నే అందిపుచ్చుకున్నారు తెలంగాణాకు చెందిన ముగ్గురు పేద విద్యార్ధినులు.వివరాలలోకి వెళ్తే.


తెలంగాణా గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్న ముగ్గురు విధ్యార్దినిలు అమెరికాలో ప్రఖ్యాత కమ్యునిటీ కాలేజీలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంపిక అయ్యారు.అమెరికాలో చదువుకోవాలనే వారి కలను ఎంతో కష్టపడి సాకారం చేసుకున్నారు.

ముగ్గురూ పేద విధ్యార్దినులే కానీ అమెరికా చదువులు అంటే మాటలు కాదు లక్షలకు లక్షలు కావాలి.కానీ ప్రతిభ ఉంటె, ఆంగ్ల బాషపై పట్టు ఉండి, వెన్ను తట్టే వారు ఉంటే తమ కల సాకారం అవుతుందని తెలుసుకున్న విద్యార్ధినులు ఎంతో కష్టపడి గురుకుల పాటశాలలో ఆంగ్ల బాషపై పట్టు సాధించారు.


అమెరికన్ కాన్సులేట్ నిర్వహించే పరీక్షలలో ఎంపిక అయ్యి అక్కడి ప్రఖ్యాత కాలేజీలలో చదువుకునే అర్థత సాధించారు.వారే హైదరాబాద్ కు చెందిన బ్లోసమ్ వనపర్తికి చెందిన ప్రీతి, రంగారెడ్డి కి చెందిన శిరీష.

వీరి చక్కని ప్రతిభకు నిర్వాహకులు కూడా ఫిదా అయ్యారు.గురుకుల కాలేజీ యాజమాన్యం కూడా వారి ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే వారికి ఆర్ధిక పరిస్థితులు అడ్డు రాకూడదు ,అలాంటి వారి కలలను సాకారం చేసేందుకు ఇలాంటి ఎంపిక పోటీలు ఉన్నాయని తెలిపారు.ఎంపికయిన ఈ ముగ్గురు విధ్యార్ధినులు అమెరికా కమ్మునిటీ కాలేజ్ ఇనిషిఏట్ ప్రోగ్రామ్ ప్రోశ్చాహకంతో కాలేజీలలో చదవనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube