భారీ అప్పులతో తెలంగాణ రాష్ట్రం.. బడ్జెట్లో చూపించని కేసీఆర్..

తెలుగు రాష్ట్రాల పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా తయారైంది.బడ్జెట్ అంచనాల్ని ఇష్టం వచ్చినట్లు పెంచేయడంతో సంవత్సరం ఆఖరులో అసలు రంగు బయటపడుతోంది.

 Telangana State With Huge Debts Kcr Not Shown In The Budget Details, Telangana Budget, Telangana Debts, Cm Kcr, Andhra Pradesh, Social Schemes, Mission Bhageeratha, Mission Kakatiya, Telangana Government, Ap Debts, Jagan, Chandrababu-TeluguStop.com

వస్తుందంటూ బడ్జెట్ లో చూపించిన ఆదాయం రాక అన్నిటికీ కోత పెడుతున్నారు.గొప్పలకు పోయి లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టి చివరకు ఖర్చుల్లో కోత విధిస్తున్నారు.

ఖర్చులకు తగిన ఆదాయం రాకపోవడంతో రాష్ట్రాలను అప్పుల కుప్పలుగా మారుస్తున్నారు పాలకులు.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్థంగా తయారయ్యాయి.

 Telangana State With Huge Debts KCR Not Shown In The Budget Details, Telangana Budget, Telangana Debts, Cm Kcr, Andhra Pradesh, Social Schemes, Mission Bhageeratha, Mission Kakatiya, Telangana Government, Ap Debts, Jagan, Chandrababu-భారీ అప్పులతో తెలంగాణ రాష్ట్రం.. బడ్జెట్లో చూపించని కేసీఆర్..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దొరికిన చోటల్లా అప్పులు చేస్తున్నా ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకటో తారీఖున జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు రాష్ట్ర వాటాగా వచ్చిన అప్పులు 75 వేల కోట్లు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు 3.3 లక్షల కోట్ల రూపాయలు. ఇంకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర కార్పొరేషన్ల పేరు మీద తీసుకున్న లక్షా 5 వేల కోట్లను బడ్జెట్లో చూపించలేదు.అన్నీ కలుపుకుంటే తెలంగాణ అప్పులు 4 లక్షల 35 వేల కోట్లు దాటతాయి.

తెలంగాణ ధనిక రాష్ట్రం అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు.ఒక వైపున అప్పులు పెరిగిపోతున్నాయి, మరో వైపున కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు కొండల్లా పెరుగుతున్నాయి.

జీతాలు సమయానికి ఇవ్వలేకపోతున్నారు.

ఇక ఏపీ పరిస్తితి కూడా ఇలాగే తయారైంది.

విభజన నాటికి విభజిత ఆంధ్రప్రదేశ్ కు లక్షా 4 వేల కోట్లు అప్పుగా వచ్చింది.

చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనా కాలంలో 2 లక్షల 10 వేల కోట్ల అప్పు చేశారు.దీంతో జగన్ సీఎం అయ్యే నాటికి రాష్ట్రం మొత్తం అప్పు 3 లక్షల 14 వేల కోట్లకు పెరిగింది.ఇక తన మూడేళ్ళ పాలనా కాలంలో జగన్ 3 లక్షల 8 వేల కోట్లు అప్పు చేశారు.

ఇష్టం వచ్చినట్లు ఉచిత పథకాలు అమలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే వాదనలు ఉన్నాయి.మూడేళ్ళ కాలంలో లక్షా 40 వేల కోట్ల వరకు ప్రజలకు వివిధ పథకాల కింద పంపిణీ చేశామని ఏపీ ప్రభుత్వమే చెబుతోంది.

, విద్య, వైద్య రంగాలకు కాకుండా ఇతర రంగాలకు విచ్చలవిడిగా నగదు పంపిణీ పథకాలు అమలు చేస్తే భవిష్యత్లో ప్రజల మీద పెనుభారం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube