పార్టీలకు తక్కువ ధరకే స్థలం ... టీఆర్ఎస్ కే ఎక్కువ ప్రయోజనమా ..?  

Telangana State To Give Land For Political Party Offices-

రాజకీయ పార్టీలు ఏవైనా పనిచేసే ముందు కానీ ఏదైనా ప్రకటించుకునే ముందు కానీ అందులో తమకు వచ్చే లాభం ఏంటి అనేది ఖచ్చితంగా చూస్తారు.లాభం ఉంటె తప్ప ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు.ఏ పార్టీకి ఇబందులో మినహాయింపు అయితే లేదు..

Telangana State To Give Land For Political Party Offices--Telangana State To Give Land For Political Party Offices-

అన్ని ఒక తానులో ముక్కల్లాగే వ్యవహరిస్తుంటాయి.ఇక విషయానికి వస్తే ముందస్తు ఎన్నికలు వస్తాయనే కంగారులో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగానే గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకు శాశ్వత ప్రాతిపదికన గజం వంద రూపాయలకే స్థలం అందించేందుకు ఓ సరికొత్త పధకాన్ని ప్రవేశపెట్టాడు.

అయితే అది అన్ని పార్టీలకంటే టీఆర్ఎస్ కే ఎక్కువ లాభం చేకూరుస్తుందని ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.

గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు తెలంగాణాలో వారి పార్టీ ఆఫీస్ ను నిర్మించేందుకు భూములను ఇచ్చేందుకు మార్గదర్శకాలను జారి చేసింది తెలంగాణ ప్రభుత్వం.దీనికి సంబంధించి పార్టీ కార్యాలయాలకు స్థలాలను లీజుకు ఇచ్చే పాలసీని సవరించి, నామమాత్రపు ధరకు కేటాయించేలా ఓ పాలసీని రూపొందించింది.

కొత్త పాలసీకి మంత్రివర్గం ఆమోదం లభించిన నేపథ్యంలో రెవెన్యూశాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది.

ఈ మేరకు రెవిన్యూ శాఖ జీవో నంబర్ 168 ని విడుదల చేసింది.దీంతో గతంలో అనుసరించిన లీజు విధానానికి సర్కార్ స్వస్తి పలికింది.ఇప్పటి వరకు రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణాల కోసం ఏ ప్రభుత్వమైనా కాల పరిమితో కూడిన లీజు విధానంతో భూములు ఇచ్చేది.

అయితే, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పద్దతికి స్వస్తి పలికింది.పార్టీ కార్యాలయాలకు స్థలాలను లీజుకు ఇచ్చే పాలసీని సవరించి, నామమాత్రపు ధరకు కేటాయించేలా పాలసీని రూపొందించింది..

జీవో 168 ప్రకారం, పార్టీలు నేరుగా వందకే గజం భూమిని కొనుగోలు చేయవచ్చు.రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి రాజేశ్వర్‌ తివారీ జీవో 168 జారీ చేశారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అధికంగా లభ్ది పోందేది అధికార పార్టీ నే .

ఎందుకంటే రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీలన్నింటికి ఇప్పటికే ప్రభుత్వం నుంచి ట్రస్టుల రూపంలోనో, లేక నేరుగానో పార్టీ కార్యాలయాలు కొనుగోలు చేసి నడుపుతున్నాయి.కానీ ఇప్పటిదాకా గులాబీ పార్టీకి అధికారిక భవనాలు ఎక్కడా లేవు.కాబట్టి వంద రూపాయిలకే గజాం స్ధలం టిఆర్ఎస్ పార్టీ పటిష్టం చేసే పనిలో భాగంగానే ఈ నిర్నయం తీసుకున్నారని తెలుస్తోంది.

అంతేలే ఏడైనా ఎన్నిక ముందు అందునా ప్రభుత్వం ఉన్నప్పుడే ఇటువంటివి చక్కబెట్టుకోవాలి ఈ విషయం అధికార పార్టీ నాయకులకు బాగా తెలుసు.