ఎన్నికల సంఘం పై సీరియస్ కామెంట్లు చేసిన తెలంగాణ హైకోర్టు..!! 

మహమ్మారి కరోనా సెకండ్  వేవ్ ఉద్రిక్తత భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే.దేశంలో రోజుకి లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావటం మరో పక్క వేల సంఖ్యలో మరణాలు సంభవించడం తో.

 Telangana State High Court Makes Serious Comments On Election Commission ,  Tela-TeluguStop.com

ఇండియాలో పరిస్థితి చూసి అంతర్జాతీయంగా వివిధ దేశాలు సహాయాలు చేయడానికి ముందుకు వస్తున్నాయి.ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమలులోకి తీసుకు రావడం జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో పరిస్థితులు భయంకరంగా ఉన్న నేపథ్యంలో  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పై తెలంగాణ హైకోర్టు సీరియస్ కామెంట్లు చేసింది.

ఒకపక్క ప్రజల ప్రాణాలు పోతుంటే ఎన్నికలకు ఎలా వెళ్లారు అంటూ SEC తీరుపై మండిపడింది.

యుద్ధం వచ్చిన ఆకాశం విరిగి మీద పడిన ఎన్నికలు జరగాల్సిందేనా అంటూ ప్రశ్నించింది.అంతేకాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు భూమిపై నివసిస్తున్నరా.? లేకపోతే ఆకాశం లో నివసిస్తున్నారా.? అంటూ ప్రశ్నించింది.ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదించిన తర్వాతే.ఎన్నికలకు వెళ్ళినట్లూ ఎన్నికల సంఘం తెలిపింది.మరో పక్క రేపు రాత్రి తో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ముగియనున్న క్రమంలో.తదుపరి నిర్ణయం ఏంటి అన్నదానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రేపు సాయంత్రం చెబుతామని హైకోర్టు కి తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube