తెలంగాణాలో వ్యాక్సిన్ ఎంతమందికి వేశారంటే..!

ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న తెలంగాణా రాష్ట్రంలో ఓ పక్క వ్యాక్సిన్ డ్రైవ్ కూడా జరుగుతుంది.తెలంగాణాకు 55,52,360 వ్యాక్సిన్ డోస్ లు వచ్చాయి.

 Telangana State Corona Vaccination Process Update-TeluguStop.com

అందులో 54,39,713 వ్యాక్సిన్లు వాడేసినట్టు తెలుస్తుంది.వీటిలో మొదటి డోస్ వ్యాక్సిన్ 43,74,351 దాకా వేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈమధ్యనే మొదలైన సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా 10,65,362 డోస్ లను వేసినట్టు తెలుస్తుంది.

 Telangana State Corona Vaccination Process Update-తెలంగాణాలో వ్యాక్సిన్ ఎంతమందికి వేశారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుధవారం రోజు మొదటి డోస్ 657 మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేశారు.

ఇక సెకండ్ డోస్ నిన్న 33,438 డోస్ ల దాకా వేసినట్టు తెలుస్తుంది.ప్రస్తుతానికి 45 ఏళ్లు పై బడిన వారికే ఈ వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారు.

అయితే ఆ ఏజ్ వాళ్లకే ఫస్ట్ డోస్ మిస్సైన వారికి ఆ డోస్.ఫస్ట్ డోస్ వేసుకుని 28 రోజులు దాటిన వారికి సెకండ్ డోస్ కూడా వేస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రం లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసిందని చెప్పొచ్చు.తర్వాత దశలో 18 నుండి 44 మధ్య వయసు వారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణాలో వ్యాక్సి ప్రక్రియ బాగానే జరుగుతున్నట్టు తెలుస్తుంది.అయితే ఓ పక్క కేసులు పెరుగుతుండగా లాక్ డౌన్ తో పాటుగా సాధ్యమైనంత వరకు ఈ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తుంది తెలంగాణా ప్రభుత్వం.

#Covid Vaccine #Update #TelangaVaccine #TelanganaState #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు