రెచ్చిపోతే చిత్తు అయిపోవల్సిందేనా రేవంత్ ?  

Telangana Seniour Congress Leaders Not Intrested To Revanth Reddy - Telugu Congress Working Party President, Drone Fly On Kcr Farm House, Ktr Farm House, Revanth Reddy Arrest, Telangana Congress,, Telangana Trs Party, Trs Leaders

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుపొందిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.ఆ పార్టీ నాయకులు ఎవరూ రేవంత్ విషయంలో మద్దతు పలికేందుకు ఇష్టపడకపోవడం టిఆర్ఎస్ కు బాగా కలిసి వస్తోంది.

 Telangana Seniour Congress Leaders Not Intrested To Revanth Reddy

పార్టీ కోసం తాను ఇంత కష్టపడుతున్నా, పార్టీ నాయకులు ఎవరు తనకు మద్దతు పలకకపోగా, తిరిగి తనపైనే విమర్శల బాణాలు వదులుతుండడంతో రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు.అసలు రేవంత్ కు ఇటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తే, ఆయన దూకుడు స్వభావమే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది అనే విషయం అర్థమవుతోంది.

టీడీపీ లో ఉన్న రేవంత్ అదే దూకుడుతో వ్యవహరించి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు.

రెచ్చిపోతే చిత్తు అయిపోవల్సిందేనా రేవంత్ -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తన రాజకీయ ప్రత్యర్థి ఎంతటి వాడైనా, అదరకుండా, బెదరకుండా పదునైన విమర్శలు చేయడంలో ఎప్పుడూ రేవంత్ ముందుంటారు.

టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా అదే విధంగా వ్యవహరిస్తున్నారు.టిఆర్ఎస్ పైన, కేసీఆర్ కేటీఆర్ పైన రేవంత్ చేసినట్లుగా మరెవరు విమర్శలు చేయలేదనే చెప్పాలి.ఈ దూకుడు వైఖరికి కాంగ్రెస్ అధిష్టానం మెచ్చుకుని మరి ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది.అంతేకాకుండా త్వరలో తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిని కూడా అప్పగించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రేవంత్ రాజకీయాల్లో స్వల్ప కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని బలమైన నాయకుడిగా ఎదిగారు.రేవంత్ ఇలా ఎదుగుతూ ఉండడం కాంగ్రెస్ సీనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదు.

అంతేకాకుండా రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల గురించి గానీ, మరి ఏ విషయాల గురించి గానీ ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మిగతా వారి ఆగ్రహానికి గురి అవుతున్నారు.

ఇప్పుడు రేవంత్ పై ధ్వజమెత్తిన కాంగ్రెస్ సీనియర్లు అందరికీ ఈ వ్యవహారమే నచ్చడం లేదు.రేవంత్ ఒక్కరే పార్టీలో హీరోగా ఎదగాలని చూస్తున్నారని మిగతా వారిని పట్టించుకోవడం లేదని, ఒకవేళ ఆయనకు నిజంగా పిసిసి అధ్యక్ష పదవి వస్తే మిగతా నాయకులందరినీ మరింతగా అణగదొక్కుతారనే భయం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు వచ్చేసింది.అందుకే ఇప్పుడు ఆయన అరెస్టు కావడంతో సానుభూతి చూపించాల్సింది పోయి టిఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

రేవంత్ కేవలం తన పలుకుబడి పెంచుకునేందుకు హడావుడి చేస్తున్నాడని, దీనికి పార్టీతో సంబంధంలేదని, ఎక్కవగా రెచ్చిపోతే పరిణామాలు ఇలానే ఉంటాయని కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ తీరుపై మండిపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test