ఆర్టీసీ సమ్మె : నేడు ఏం జరుగబోతుంది?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఉదృత రూపం దాల్చింది.నేడు సాయంత్రంకు డ్యూటీలో జాయిన్‌ అయిన వారికి ఉద్యోగాలు ఉంటాయి.

 Telangana Rtc Strike Whats Going On In Today-TeluguStop.com

లేదంటే అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి అంటూ సీఎం కేసీఆర్‌ మరో అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన విషయం తెల్సిందే.నేడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు పలువురు ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంది అంటూ ప్రభుత్వ వర్గాల వారు భావిస్తున్నారు.

కాని కార్మిక నాయకులు మరియు సంఘం నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విధుల్లోకి చేరేది లేదు అంటూ తేల్చి చెబుతున్నారు.

ఆర్టీసీ కార్మికులు ఖచ్చితంగా విధుల్లో చేరాలంటూ సీఎం చేసిన ఆదేశాలకు కార్మికుల నుండి పెద్దగా స్పందన వస్తున్నట్లుగా లేదు.

పట్టు సడలకుండా కార్మికులు సమ్మె చేస్తున్నారు.ఈ నేపథ్యంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడాలి.

కార్మికులు జీతాలు లేకుండానే ఇబ్బందులు పడుతూ కూడా సమ్మె చేస్తున్నారు.కాని డ్యూటీల్లో చేరేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు.

ఈ సమ్మె ఇలాగే కొనసాగితే రేపు సీఎం కేసీఆర్‌ మరియు ఆర్టీసీ యాజమాన్యాలు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube