ఉమెన్స్ డే సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఫ్రీ జర్నీతో పాటు లక్కీ డ్రా కూడా..!!

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరొక శుభవార్తను అందించింది.ఈ శుభవార్త కేవలం ఆడవాళ్లకి మాత్రమే అని గమనించగలరు.

 Telangana Rtc Special Offer On Womens Day With Free Journey And Lucky Draw Detai-TeluguStop.com

ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీ పండగలకు, జాతరలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులకు బాగా చేరువైంది.ఈ క్రమంలోనే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక గొప్ప ఆఫర్‌ ను ప్రకటించారు.

గ్రేటర్ హైదరాబాద్‌ నగరంలో రోజులో రద్దీగా ఉండే సమయంలో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు.ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు ఉమెన్స్ డే సందర్బంగా మార్చి 8న ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

అలాగే ఆడవారికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 డ్రైవింగ్‌ శిక్షణ సంస్థల్లో నెల రోజుల పాటు భారీ వాహనాలు నడిపేలా డ్రైవింగ్‌లో వారికి ఉచిత శిక్షణ ఇప్పించనున్నారు.

ఎవరయితే డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఆ మహిళలు తప్పనిసరిగా ఎల్‌.ఎం.వీ.లైసెన్సు, రెండేళ్ల అనుభవం ఉండాల్సి ఉంటుంది.

Telugu Baji Govardhan, Journey, Journey Lucky, Lucky, Rtc, Telangana Rtc, Vc Saj

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజువారీ పాస్ అయిన టీ-24 టిక్కెట్‌పై మార్చి 8 నుంచి 14 వరకూ 20 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు.వరంగల్‌లోనూ ఈ రాయితీ ఉంటుంది.కాగా గర్భిణీలు, బాలింతలు ఆర్డినరీ, లేదా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎక్కినట్లయితే వారికీ రెండు చొప్పున సీట్లను కేటాయించున్నారు.

అంతేకాక, మహిళలకు లక్కీ డ్రా సదుపాయం కూడా కలదు.లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నెల రోజుల పాటు డిపో నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో ఉచితంగా ప్రయాణంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube