ప్లీజ్ చర్చలు జరపండి ! మెట్టు దిగుతున్న ఆర్టీసీ జేఏసీ

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికీ 41 వ రోజుకి చేరింది.ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

 Telangana Rtc Jac Leaders Request To Government-TeluguStop.com

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా కోరారు.ఇప్పటికే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.అయినా ప్రభుత్వం ఈ విషయంలో మెట్టుదిగేలా కనిపించకపోవడంతో చివరకు ఆర్టీసీ జేఏసీ నేతలే ఒక మెట్టు దిగారు.

ఈ మేరకు ప్రబుథ్వములో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టామని, ప్రభుత్వం చర్చలు జరపాలని తాము కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.పోలీసులు మఫ్టీలో వచ్చి జేఏసీ నేతల్ని అరెస్ట్‌ చేస్తున్నారని, ఇది సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాము చేస్తున్నసమ్మెకు అన్ని వర్గాలు మద్దతివ్వాలని అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాము ఒక మెట్టు దిగామని మిగతా 25 డిమాండ్ల మీద చర్చ జరపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.శుక్రవారం అన్ని గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామని, ఈ నెల 16న ఇందిరాపార్క్‌ వద్ద జేఏసీ నేతలు దీక్ష చేస్తారని తెలిపారు.17, 18 తేదీల్లో అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు.19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube