అన్యాయం అవుతున్న ఆర్టీసీ.. కేంద్రం నిర్ణయంతో మరింత ప్రమాదంలోకి.. ?

తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందనే ప్రచారం జరుగుతుంది.సరిపడ బస్సులు లేక అంతరాష్ట్ర సర్వీసులను ఆంక్షలతో నడుపుకుంటున్న రాష్ట్ర ఆర్టీసీ ఇప్పుడు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు.

 Telangana Rtc Is Troubling With Central Government Decisions , Ts Rtc, Red Carpe-TeluguStop.com

అదీగాక ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లో నెట్టుకు వస్తున్న తెలంగాణ ఆర్టీసీకి కేంద్రం తీసుకువచ్చిన కొత్త పర్మిట్​ విధానం మరింత ప్రమాదకరంగా మారిందట.ఇలా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలేమైనా ఆర్టీసీకి మాత్రం అన్యాయం అవుతుందంటున్నారు.

ఇన్నాళ్లుగా పట్టుకుంటే జరిమానాలు చెల్లించాల్సి వస్తుందంటూ భయపడుతూ తిరిగిన ప్రైవేట్​ ట్రావెల్స్​కు ఎర్ర తివాచీ పరుస్తున్న కేంద్రం ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేవిధంగా ఉన్న ప్రవర్తించడం చర్చాంశనీయంగా మారింది.ఇప్పటి వరకు దొంగచాటుగా ప్రయాణికులను దోచుకుంటూ, పట్టాపగ్గాలు లేకుండా దూసుకుపోతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు ఇక నుండి పబ్లిక్‌గానే దోపిడికి తెరలేపే అవకాశాన్ని కల్పించినట్లుగా ఈ నిర్ణయాలున్నాయట.

దీని ఫలితంగా డొక్కు ఆర్టీసీ బస్సులకు ప్రయాణీకులు తగ్గిపోతారు.ఏసీలు, సూపర్​ లగ్జరీ బస్సులను స్టేజీ కారియర్లుగా తిప్పితే ఆర్టీసీ బస్సుల వైపు చూసే వారుండరు.

అంటే ఆర్టీసీకీ ఈ ఆదాయం పోయినట్టే.ఇకపోతే కేంద్రం గతంలోనే చేసిన సవరణ ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చింది.

మొత్తానికి ఆర్టీసీ పతనానికి కారణమయ్యే కొత్త విధానానికి కేంద్రం ఆమోదం చెప్పడం దురదృష్టకరం అంటున్నారట కొందరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube