తెలంగాణాలో ఆ కారణంతో ఎక్కువమంది చనిపోతున్నారు

స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, బిజినెస్ గ్రోత్ లాంటి చెప్పుకోదగ్గ విషయాల్లోనే కాదు, చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించే ఓ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో నెం.1 గా నిలిచింది.అదేంటంటే, తెలంగాణాలో రిజస్టర్ అవుతున్న మరణాల్లో, అత్యధికశాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నవారే ఉన్నారట.అది ఎంత దారుణం అంటే, రిజిస్టరు అవుతున్న మరణాల్లో 57.10% మంది గుండెవ్యాధులతోనే చనిపోయారట.అంటే ప్రతీ వంద చావుల్లో కేవలం ఒక్క గుండె సంబంధిత సమస్యలతోనే 57 మంది చనిపోతున్నారన్నమాట.

 Telangana Ranks First In Heart Deaths In India-TeluguStop.com

మొత్తం భారతదేశంలో గుండె జబ్బులతో చనిపోతున్నవారిలో 31.60 శాతం మంది తెలంగాణ వారే అంట.అందులో గుండె వ్యాధులతో పురుషుల మరణాలు మహిళలతో పోలిస్తే చాలా అంటే చాలా ఎక్కువ.

తెలంగాణాలో 57.10% మరణాలు గుండె వ్యాధుల వలన జరిగితే, తమిళనాడులో 48.100% మరణాలు, ఆంధ్రప్రదేశ్‌లో 32.50% మరణాలు, కర్ణాటకలో 29.60% మరణాలు, హిమాచల్ ప్రదేశ్ లో 25.50%, పంజాబులో 24.20%, బీహార్‌లో 22.70% మరణాలు గుండె వ్యాధుల వలన సంభవిస్తున్నాయి అని రిజిస్టరు జనరల్ ఆఫ్ ఇండియా ఓ రిపోర్టు ని బయటపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube