తెలంగాణాలో వర్షపు సూచన..!

తెలంగాణాలో ఈరోజు, రేపు రెండు రోజులు స్వల్ప వర్షపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ వెళ్లడించింది.దక్షిణ ఛత్తీస్ గడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపతితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా తెలంగాణాలో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.తెలంగాణాలో కొన్ని ప్రాంతాలకే ఈ వర్షపు సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది.

 Telangana Rain Alert Few Districts Telangana State Department Of Meteorology , F-TeluguStop.com

తెలంగాణా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్ లో వర్షాలు ఉండే అవకాశం ఉంది.

సూర్యాపేట, భద్రాద్రి కొత్తగుడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖా అధికారులు చెబుతున్నారు.

మిగతా ప్రాతాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని తెలియచేశారు.అయితే పైన తెలిపిన జిల్లాల్లో మాత్రమే వర్షం పడే అవకాశాలు ఉన్నాయని.

మిగతా ఏరియాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు.మార్చి నెల ఆఖరి నుండి తెలంగాణాలో ఎండ తీవరత పెరిగింది.

అయితే నేడు, రేపు మాత్రం తెలంగాణాలో కొన్ని ప్రాంతాలు వర్షం పడి చల్లబరుస్తాయి.అయితే ఈ తుఫాన్ తీవ్రత కేవలం రెండు రోజులే అని చెప్పినా మరో రెండు రోజులు కూడా ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

తెలంగాణాలో ఈ వర్షాల వల్ల ఎండ తీవ్రత కొద్దిగా తగ్గనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube