తెలంగాణ గడ్డపై బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ సభలు

తెలంగాణ గడ్డపై బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నాయి.ఒకపక్క ప్రధాని నరేంద్రమోడీ బేగంపేట విమానాశ్రమానికి వస్తుంటే, మరోపక్క ప్రధాని కంటే ముందే యూపీఏ భాగస్వామ్యపక్షాల రాష్ట్ర పతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రావడంతో పోటాపోటీ సభలకు హైదరాబాద్ వేదికగా మారింది.

 Telangana Politics Heating Up With Trs And Bjp Parties Public Meetings Details,-TeluguStop.com

ఒకరకంగా చూసుకుంటే ఆధిపత్యపోరుకు సిద్దమైనట్లు తెలుస్తోంది… గత నెల రోజుల ముందే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని తేదీలు ఖరారు అయ్యాయి.ఇందులో భాగంగా ఈరోజు ప్రధాని మోడీ పర్యటన ఖరారయింది.

కాగా టీఆర్ ఎస్ పార్టీ ఇందుకు ప్రతిగా స్థానికంగా పై చేయి సాధించాలనే తపనతో యశ్వంత్ సిన్హా ప్రచార కార్యక్రమాన్ని నెత్తిన వేసుకుంది.స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హా ను ఆహ్వానించారు.

అక్కడి నుంచి ర్యాలీగా జలవిహార్కు తీసుకెళ్లి సభను ఏర్పాటు చేశారు.ఇలా పోటీ ర్యాలీలు నిర్వహిస్తోంది.ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ మధ్య ప్లెక్సీల గొడవ తారాస్థాయికి చేరుకుంది.బీజేపీ జాతీయ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి.

హెచ్ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.అలాగే రేపు పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

ప్రధాని హాజరు కానున్న ఈ సభకు రాష్ట్ర బీజీపీ నేతల విస్తృత ఏర్పాట్లు చేశారు.కాగా తమేమితక్కువ కాదంటూ టీఆర్ ఎస్ నేతలు కూడా యశ్వంత్ సిన్హా పేరుతో పోటీలు పడి సభలు పెట్టి బీజేపీ పట్ల ప్రజలకున్న మూడ్ ను డైవర్ట్ చేసేందుకు వ్యూహం పన్నింది.

Telugu Amith Sha, Bjp Executive, Bjp Trs, Cm Kcr, Jp Nadda, Primenarendra, Telan

కాగా జలవిహార్ లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధని నరేంద్ర మోడీపై, కేంద్రలోని బీజేపీ ప్రభుత్వంపై అక్కసు కక్కారు.గత రెండు మూడు రోజుల నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన సెంట్రల్ నేతలు సీం కేసీఆర్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేశారు.త్వరలోనే కుటుంబ పాలన అంతం అవుతుంది.బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటవుతుందని ధీమాగా చెపుతున్నారు.ఇలా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి… ఇలా పోటా పోటీ సభలు పెట్టడంతో హైదరాబాద్ నగరంలో పూర్తిగా ట్రాఫిక్ జాం అయింది.పర్యవసానంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు… మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టేందుకు ఆ పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నాయి.

రారున్న రోజుల్లో మరింతగా ఇరుపార్టీల వివాదం మరింతగా ముదిరే అవకాశాలున్నట్లు అభిప్రాయపడుతున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube