బాబు బుక్కయిపోతాడా ..? ఆ లేఖతో ఓటుకు నోటు కేసు తెరపైకి

రాజకీయంగా ఏపీ సీఎం చంద్రబాబు ని ఇబ్బంది పెడుతున్న ఓటుకి నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.తెలంగాణాలో ముందస్తు ఎన్నికల జాతర మొదలవ్వడంతో పాటు అక్కడ తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమిలో చేరడమే కాకూండా యాక్టివ్ గా కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ మరుగునపడిపోయిన ఓటుకి నోటు కేసు తెర మీదకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 Telangana Police Officers Letter To Ed About Vote For Note Case-TeluguStop.com

ఓటుకు నోటు కేసులో ఈడీ రంగంలోకి దిగబోతోంది అన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.ఆ కేసులో ఐదు కోట్ల పై నిగ్గు తేల్చాలంటూ ఈడీ తో సహా కేంద్ర సంస్థ లకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి లేఖ వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది.

అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్ధి కి అనుకూలంగా ఓటువేస్తే ఐదు కోట్ల రూపాయ లు ముడుపులు ఇస్తామని బాబు స్వయంగా చెప్పటం ఆడియో టేపులలో రికార్డు అవ్వడం… అందులో భాగంగా 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా స్టీఫెన్సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఆ కేసు అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది.అయితే.ఆ తరువాత అనేక రాజకీయ మలుపులు తిరిగి ఆ కేసు మరుగునపడిపోయింది.

అయితే ఈ డీల్ లో దొరికిన ఐదు కోట్ల రూపాయలు ఎవరివి ఎక్కడ నుంచి వచ్చాయి .? మిగతా 4.5 కోట్ల రూపాయలు మాట ఏమిటి అన్నది తేల్చటానికి ఈడీ రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది.అది కూడా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తో పాటు కేంద్ర సంస్థ లను కోరుతూ లేఖ రాయటం వల్ల ఈ తతంగం అంత జరుగుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈడీ ఒక్కటేనా లేక వేరే విచారణ ఏజెన్సీ లు కూడా వస్తాయా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

ఓటుకు నోటు కేసు వెలుగులోకి చాలా కాలం అవుతున్నాయా.ఈ కేసులో పెద్దగా పురోగతి లేదు.కానీ ఉన్నట్టు౦డి ఈడీతోపాటు మరికొన్ని కేంద్ర ఏజెన్సీలకు తెలంగాణ పోలీసు అధికారులు లేఖ రాయటం వెనక రాజకీయ ప్రోద్బలం ఉండనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే … ఆ కేసులో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరి ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ లు ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube