సీఎం నిర్ణయంపై జనాల స్పందన

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌ డౌన్‌ను కొనసాగించడం మంచిదంటూ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.ఆర్థిక పరిస్థితులను గురించి చూసుకుని లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అంటూ సీఎం ఆందోళన వ్యక్తం చేశాడు.

 Telangana Peoples Responce About Kcr Extend The Lock Down Decission, Kcr, Telang-TeluguStop.com

ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇటీవల జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది.అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ ఇండియాలో లాక్‌ డౌన్‌ జూన్‌ 3 వరకు కొనసాగాలని సూచిస్తుంది.

అందుకే దీన్ని మనం ఆషామాషీగా తీసుకోవద్దంటూ సీఎం విజ్ఞప్తి చేశాడు.

కేంద్రం లాక్‌ డౌన్‌ను ఎత్తివేసినా లేదా సడలించినా కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మరికొన్ని రోజులను ఇదే పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ను కొనసాగించడం తద్యంగా కనిపిస్తుంది.

అయితే సీఎం కేసీఆర్‌ నిర్ణయంను ప్రజు గౌరవిస్తున్నారు.ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం సరైనదిగా భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్‌ డౌన్‌ తప్ప మరే పరిష్కారం లేదు.మన దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మరికొన్ని రోజులు లాక్‌ డౌన్‌ విధించినా తామంతా కూడా విధిగా పాటిస్తామని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకుని నిలుస్తామంటూ కేసీఆర్‌ నిర్ణయంను సమర్ధిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube