తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం ఆయనకేనా ? ఫిక్స్ అయ్యిందా ?  

Telangana Pcc Chief Komati Reddy Revanth Reddy - Telugu Chandrababu, Komatireddy Venkat Reddy, Revanth Reddy, Sonia Gandhi, Telangana Pcc Chief

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములా మారింది.ఎప్పటి నుంచో పిసిసి అధ్యక్షునిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని అధిష్టానం చూస్తున్నా, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో సఖ్యత లేకపోవడం, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

 Telangana Pcc Chief Komati Reddy Revanth Reddy

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే పిసిసి అధ్యక్షుడు చేయాలని అధిష్టానం భావించింది.కానీ అనుకోకుండా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవ్వడం , ఆ వ్యవహారం కాస్తా వాయిదా పడింది.

ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతోనే కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం అధిష్టానం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం ఆయనకేనా ఫిక్స్ అయ్యిందా -Political-Telugu Tollywood Photo Image

అధిష్టానం దృష్టిలో పడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదంటూ కాంగ్రెస్ సీనియర్లంతా మూకుమ్మడిగా అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేయడంతో, మరికొంత మంది పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైపు ఎక్కువగా అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.మొదటి నుంచి కాంగ్రెస్ కు చెందిన వ్యక్తిగా ఏన్ ఎస్ యూ ఐ , యూత్ కాంగ్రెస్ లో పనిచేయడం వంటివి కోమటిరెడ్డి కి కలిసొచ్చే విషయంగా కనిపిస్తోంది.

కోమటిరెడ్డి విషయంలో సోనియా గాంధీ సైతం సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పిసిసి అధ్యక్ష పదవి కోసం మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.మొదట్లో రేవంత్ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉన్నట్టు కనిపించినా, ఆయనపై సీనియర్లంతా అసంతృప్తి వ్యక్తం చేయడం, చంద్రబాబుతో రేవంత్ కు సన్నిహిత సంబంధాలు ఉండడం, తన సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లడంతో ఆయన కు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయినట్లుగానే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.మరికొద్ది రోజుల్లో కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక ను అధిష్టానం పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

దీంతో ఎవరికీ వారు ఆ పదవిని సొంతం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telangana Pcc Chief Komati Reddy Revanth Reddy Related Telugu News,Photos/Pics,Images..