ఓయూ విద్యార్థి నేత కన్నీటి గాధ.. బంగారు తెలంగాణ బాధల తెలంగాణగా మారుతుందా.. !?

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ అని సమాజంలో నెలకొన్న కుళ్లును కడుగుతూ రాసిన ఈ గీతం ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుర్బరమైన పరిస్దితులకు అద్దం పడుతున్నాయి.మేధావులు ఊహించిన విపత్తును భారతదేశం కరోనా కారణంగా ఎదుర్కొంటున్న తీరు యావత్ ప్రజలను కన్నీరు పెట్టిస్తుంది.

 Telangana Ou Student Leader Bellamkonda Krishna Goud Died In Nims Hospital, Tela-TeluguStop.com

ప్రత్యేక తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడేలా చేస్తా, కానీ నేను మాత్రం పదవులు ఆశించా అని పలికిన పెద్దమనిషి మాటలు గాల్లో కలిసిపోయాయి.ఈ బంగారు తెలంగాణ కాస్త బాధల తెలంగాణతో విలవిలలాడిపోతుంది.

కరోనాతో పోరాటం చేస్తున్న ఒక్కొక్కరిది ఒక్కోగాధ.బ్రతకాలని ఉన్నా బ్రతకలేని దుస్దితి.

ఇలా ఎందరినో ఈ కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంటుంది.

ఇకపోతే కరోనా బారినపడి పది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓయూ విద్యార్థి నేత బెల్లంకొండ కృష్ణగౌడ్ నిన్న ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే.

అయితే ఆదివారం రాత్రి భార్యకు ఫోన్ చేసి చెప్పిన మాటలు అందరితో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.ఆసుపత్రిలో ఎవరూ తనను పట్టించుకోవడం లేదని, ఆక్సిజన్ పైపు కూడా పెట్టలేదని ఇప్పటికైతే బతికే ఉన్నాను కానీ తర్వాతి సంగతి చెప్పలేనంటు చెప్పిన చివరి మాటలు మన తెలంగాణాలో నెలకొన్న కరోనా పేషెంట్స్ పరిస్దితులను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది.

ఇలాంటి బాధలు ఇతనికే కాదు ఎందరో ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.అబద్ధాలతో పబ్బం గడుపుకుంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్న తెలంగాణ నేతల గుట్టు ఇకనైన తెలుసుకోకుంటే రానున్న కాలంలో పేదలంతా పెద్ద బిచ్చగాళ్లుగా మారిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారట మేధావులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube